ఇండియా పాక్ దేశాల మధ్య భారీ స్థాయిలో రగడ జరుగుతున్న సమయంలో కొన్ని సంఘటనలు రెండు దేశాలను ఇబ్బందులు పెడుతున్నాయి.  ఇండియాపై కోపంగా ఉన్న పాక్.. ఇండియాను ఎలాగైనా ఎదుర్కోవాలని.. ఇండియాపై పగతీర్చుకోవాలని చూస్తున్నది.  కాశ్మీర్ విషయంలో ఇండియా తీసుకున్న నిర్ణయంతో పాక్ మరింత రెచ్చిపోతున్నది.  దీంతో ఇండియాపై ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో తెలియడం లేదు.  


అవకాశం కోసం ఎదురుచూస్తున్న పాక్ కు కులభూషణ్ ను దొరకబట్టుకుంది.  ఉగ్రవాదిగా పేరు మోపింది.  అతనిపై అభాండాలు వేసింది.  అయితే, కులభూషణ్ విషయంలో ఇండియా అలర్ట్ గా ఉండటంతో కొంతవరకు సక్సెస్ అయ్యింది.  ఇప్పుడు పాక్ బోర్డర్ లోకి అనుకోకుండా ప్రశాంత్ అనే తెలుగు వ్యక్తి ప్రవేశించాడు.  విశాఖకు చెందిన ప్రశాంత్ హైదరాబాద్ లో ఉంటున్నాడు.  అయితే, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి అక్కడ సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు.  అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.  


2017 నుంచి కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి.  కారణాం ప్రేమ అని అంటున్నారు.  ప్రేమ కోసమే కుటుంబం నుంచి దూరంగా వచ్చేశాడని అంటున్నారు.  బెంగళూరులో ఉద్యోగం చేసుకునే ప్రశాంత్ ఎందుకు పాక్ బోర్డర్ కు వెళ్ళాడో.. ఎందుకు దాటాడో తెలియడం లేదని ప్రశాంత్ తల్లిదండ్రులు చెప్తున్నారు.  ప్రశాంత్ కు ఆన్లైన్ లో ఓ యువతి పరిచయం అయ్యిందని, ఆమెనుఆచూకీ కోసం ప్రశాంత్ గూగుల్ మ్యాప్స్ ఆధారంగా బోర్డర్ దాటి వెళ్లాడని అంటున్నారు.  


అయితే, ప్రశాంత్  రెండేళ్ల క్రితమే యువతిని వెతుక్కుంటూ రాజస్థాన్ వెళ్లాడని, అయితే, మ్యాప్స్ ఆధారంగా వెట్టుకుంటూ వెళ్లిన ప్రశాంత్ కు యువతి కనిపించకపోవడంతో మానసికంగా ఇబ్బందులు పడ్డాడని, పొరపాటున ప్రశాంత్ పాక్ బోర్డర్ లోకి వెళ్లాడని అంటున్నారు. రెండేళ్ల క్రితమే ప్రశాంత్ బోర్డర్ దాటారని అంటున్నారు.  రెండేళ్ల క్రితమే ఇండియా దాటి పాక్ బోర్డర్ లో అడుగుపెడితే ఇప్పటి వరకు ఎందుకు ప్రశాంత్ ను పట్టుకోలేదు.  నిజంగానే రెండేళ్ల క్రితమే పాక్ లో అడుగుపెట్టడా లేదంటే ఇటీవలే వెళ్లాడా అన్నది తెలియాల్సి ఉన్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: