పాకిస్థాన్ లో ప్రవేశించిన తెలుగు యువకుడు ప్రశాంత్‌.. అతనితోపాటు ఉన్న మధ్యప్రదేశ్ వాసిపై ఆ దేశం అరెస్టు చేసింది. ఉగ్రవాద దాడులు చేసేందుకొచ్చారా అనే కోణంలో కూడా విచారిస్తోంది. భారత్ నుంచి దొరికే ఎటువంటి అవకాశాన్నీ వదులుకోవడానికి కూడా పాక్ సిద్ధంగా లేనట్టు ఈ ఉదంతం ద్వారా తెలుస్తోంది. నిజానికి ఇలా ఎటువంటి పత్రాలు లేకుండా పాక్ లో ప్రవేశించే ధైర్యం చేయరు. సరిహద్దులు గుర్తుపట్టలేకే ఆ భూభాగంలో అడుగు పెట్టారని అంటున్నారు. కానీ.. కుట్రలకు మారు పేరుగా ముద్రపడ్డ పాకిస్థాన్ ఎటువంటి దూరాగతాలకైనా పాల్పడే అవకాశం ఉంది.

 

 

అమ్మాయి ప్రేమ వ్యవహారంతో ప్రశాంత్ అతని స్నేహితుడు పాక్ గడ్డపై అడుగుపెట్టారనేది ఓ వాదన ఉంది. అదీ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా! అసలే జమ్మూకాశ్మీర్ అంశంలో ఉద్రిక్తత పరిస్థితులు పూర్తిగా చల్లారక ముందే ఇలాంటి తెగువ చూపడం సాహసమే. కానీ.. అందుకు ప్రతీకార కోణంలో వారిని చూపి భారత్ మీద పగ తీర్చుకోవాలనుకుంటే పాక్ మరో ఘోర తప్పిదానికి అడుగు వేసినట్టే. జాదవ్ అంశంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో నెగ్గలేకపోయిన పాక్ ఈ విషయంలో విదేశాంగ విధానాల ప్రకారం వెళ్తే ఎటువంటి గోడవా ఉండదు. ఎయిర్ ఫోర్స్ అధికారి అభినందన్ విషయంలో అంతర్జాతీయ ఒత్తిడి తట్టుకోలేక తప్పును కప్పిపుచ్చుకుంటూ భారత్ కు  అప్పగించింది పాక్. ఇప్పుడు ప్రశాంత్ విషయంలో కూడా అలాంటి తప్పు చేయకుండా ఉంటే మరో అవమానానికి గురి కాకుండా ఉంటుంది.

 

 

మరోవైపు.. ఈ ఘటనపై స్పందించారు ప్రశాంత్ తండ్రి బాబూరావు. 'మా కుమారుడు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ప్రశాంత్‌కు ఒక అమ్మాయి పరిచయం ఉంది. మా అబ్బాయి తోటి ఉద్యోగినితో ప్రేమలో ఉన్నాడనుకుంటున్నాను. ప్రేమ వ్యవహారం వల్లే మాకు టచ్‌లో లేడు. కేంద్రం స్పందించి మా బాబును ఇండియాకు రప్పించాలి. ఈ విషయాన్ని మీడియాలో చూసి మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశా' అన్నారు. అయితే.. ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన పాక్ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. దీనిపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: