ప్రస్తుతం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి.  ఈ సమావేశాల్లో అనేక విషయాలపై చర్చ జరగబోతున్నది. మాములుగా పార్లమెంట్ సమావేశలకు ఎంపీలు హాజరైతే హాజరవుతారు లేదంటే లైట్ గా తీసుకుంటారు.  అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటోంది.  ఎంపీలకు ఎప్పటికప్పుడు జరగబోయే విషయాలపైనా అవగాహన కల్పిస్తూ.. పార్లమెంట్ లో ఎలా ప్రవర్తించాలో సూచనలు ఇస్తుంది.  
ఇక కీలక బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో తప్పనిసరిగా ఎంపీలు ప్రతి ఒక్కరు హాజరు కావాలని సూచించింది.  ప్రతి ఎంపీ కూడా చాలా కీలకం అని, తప్పనిసరిగా హాజరవ్వాలని, దేశంలో పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్లాలని, వాటికి సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టాలని మోడీ సూచించారు.  ఈ బిల్లులను ఆమోదింపజేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ మోడీ ఎంపీలకు సూచనలు చేశారు.  
ఇక ప్రతిపక్షం వెల్ లోకి దూసుకెళ్లి గొడవలు చేసినా.. ఎంపీలు సంయమనం పాటించాలని, సభలో హుందాగా వ్యవహరించాలని కేంద్రం ఎంపీలకు సూచించింది.  ఈ వింటర్ సెషన్స్ చాలా కీలకమైనవి.  ఈ సెషన్స్ తరువాత వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  ఇందులో భాగంగానే ఆయా రాష్ట్రాలలో పెండింగులో ఉన్న బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తోంది.  
గతంలో జరిగిన తప్పులు జాగకుండా చూసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధం అవుతున్నది.  మహారాష్ట్ర విషయంలో బీజేపీ కొన్ని తప్పులు చేసింది.  ఈ తప్పులు చేయడంతో బీజేపీ అక్కడ కొన్ని సీట్లు కోల్పోయింది.  ఇకపై అలాంటి తప్పులు చేయకుండా ఉండాలని అనుకుంటోంది.  అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నియమాలు పాటించాలో.. ఎలా అడుగు ముందుకు వేయాలో అన్ని విషయాలను బీజేపీ ఎంపీలతో మోడీ చర్చించినట్టు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: