ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు అనే పాట గుర్తుంది కదా.. ఓల్డ్ సాంగ్.  ఇది ఇప్పటి సాంగ్ కాదు.  పాతరోజుల్లో సాంగ్.  పాట పాతదే కావొచ్చు.  కానీ, ప్రేమ అప్పుడైనా ఇప్పుడైనా ఒకేలా ఉంటుంది.  ఒకేలా సాగుతుంది.  ఆ ప్రేమలో పడిన వాళ్లకు ఆ మైకం అలానే ఉంటుంది.  అద్భుతమైన అనుభవం ఎంత చెప్పినా తగ్గదు. దానిని అనుభవిస్తేనే తెలుస్తుంది.  
ప్రేమకోసం ఖండాలు దాటిపోయాడు అని వింటుంటాం.  అవన్నీ కథల్లే అనికొట్టేస్తుంటారు.  కానీ అది నిజం. ప్రేమ కోసం, ప్రేయసి కోసం వెతుక్కుంటూ వెళ్లిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.  నిజమైన ప్రేమ వాళ్ళను ఎంతటి దూరమైనా తీసుకెళ్తుంది.  ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనేలా చేస్తుంది. ప్రశాంత్ అనే వ్యక్తి ఇండియాలోని బెంగళూరు నుంచి తన ప్రేయసిని వెతుక్కుంటూ పాకిస్తాన్ దాకా వేలాది.  బెంగళూరు నుంచి పాక్ దాకా నడిచి వెళ్లినట్టుగా తెలుస్తోంది.  2017 లో ప్రశాంత్ కనిపించడం లేదని చెప్పి అయన తండ్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.  
  పాకిస్థాన్‌లో ప్రత్యక్షమైన హైదరాబాద్ యువకుడు ప్రశాంత్ ప్రేమ వలలో చిక్కుకొని సరిహద్దులు దాటాడా? చదువు పూర్తిచేసుకుంటూనే నేటి యువత కలలు కనే సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించుకున్నాడు ప్రశాంత్ . బెంగళూరులో ఉద్యోగంలో చేరాడు. అక్కడ తనతో కలిపి పనిచేస్తున్న స్వప్నిక అనే సహోద్యోగినితో వయసు ప్రేమలో పడ్డాడు. ఎంతోమంది ప్రేమకథల్లానే..ప్రశాంత్ ప్రేమకూ పెద్దలు అడ్డుచెప్పారు. దీంతో ప్రేయసి కోసం తల్లిదండ్రులతో విభేదించాడు ప్రశాంత్...అల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్నను,  సోదరుణ్ని, ఇంటిని వదిలిపెట్టి ప్రేయసిని వెతుక్కుంటూ బయలుదేరాడు. ప్రశాంత్ అలా ఇంటి నుంచి కాలు బయటపెట్టి రెండేళ్లు గడిచిపోయాయి. ఇన్ని రోజులుగా ఎక్కడ, ఎలా తిరిగాడో ఎవరికీ తెలియదు.రెండేళ్ల కాలంలో  అతను ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, ఎన్ని అగచాట్లు పడ్డాడో తెలియదు. 
ఎక్కడెక్కడో తిరిగి చివరకు పాకిస్తాన్ లో ప్రత్యక్షం అయ్యాడు.  ప్రశాంత్ ప్రేమించిన అమ్మాయి పేరు స్వప్నిక.  తనతో పాటుగా కంపెనీలో పనిచేసేది.  స్వప్నికను వెతుక్కుంటూ బయలుదేరితే.. పాక్ వరకు ఎందుకు వెళ్ళాడు.  పాక్ లో ఆమె ఉంటుందా లేదంటే స్వప్నిక  రాజస్థాన్ లో ఉంటుందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా... అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తుచేస్తున్నారు .  అయితే పాకిస్తాన్ లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించేందుకు భారత్ కుట్ర పన్నిందని ఆ దేశ మీడియా ఆరోపిస్తోంది. వీటన్నింటి నుంచి అన్ని సమాధానాలు రావాలి అంటే ప్రశాంత్ గురించి మిగతా వివరాలు బయటకు రావాల్సి ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: