రివర్స్‌ టెండరింగ్‌పేరుతో పోలవరం పనులుఆపేసిన రాష్ట్రప్రభుత్వం, రాష్ట్రవ్యవసాయ రంగానికి తలమానికంగా నిలవాల్సిన సాగునీటిప్రాజెక్ట్‌ని మూలనపడేసిందని ఆలపాటి  మండిపడ్డారు. ప్రజాధనం మిగిల్చామని డబ్బాలు కొట్టుకుంటున్న రాష్ట్రయంత్రాంగం, జగన్మోహన్‌రెడ్డి నివాసానికి రూ.20కోట్లు తగలేసిందని, బాత్రూమ్‌లకు రూ.10లక్షలు, కిటికీలకు రూ.80లక్షలు, రోడ్డు నిర్మాణానికిరూ.5కోట్లు ఖర్చుచేయడమేంటని ఆలపాటి నిలదీశారు. 

కేవలం అన్నాక్యాం టీన్ల రంగు మార్చడానికి రూ.1100కోట్లు ఖర్చుచేసిన జగన్‌ప్రభుత్వం ఎంతసొమ్ము ఆదాచేసిందో, ఎవరికి మేలుచేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నవరత్నాలపేరుతో రాష్ట్రప్రజల నవరంధ్రాలను మూసేసిన ఘనత జగన్‌ కే దక్కుతుందన్నారు. ప్రజల్ని భ్రమల్లో ముంచి, చంద్రబాబు సంక్షేమ పథకాలను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షంపై బురదజల్లుతూ కాలక్షేపం చేస్తోందన్నారు. ఉచిత ఇసుకవిధాన ం రద్దుతో 30లక్షలమంది భవననిర్మాణ కార్మికులను రోడ్డునపడేసిన ప్రభుత్వం, జీవోల పేరుతో ప్రశ్నించేవారిపై తప్పుడుకేసులు పెడుతోందన్నారు. 

వైసీపీ పాలనవల్ల అన్నివర్గాల వారు భయభ్రాంతులకు గురవుతున్నారని, ముఖ్యంగా యువత, రైతులు, మహిళల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తామంటున్న ప్రభుత్వం, కనీసమద్దతు ధరలపై దృష్టిపెట్టాలని, వరికి రూ.2,800, జొన్నకు రూ.2,570లు, రాగికి రూ.3,150లు, పెసరకు రూ.7,500లు, మినుముకి రూ.5,700లు, అమలయ్యేలా చూడాలని,వ్యవసాయరంగంపె,ౖ రైతులకు చేసినసాయంపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆలపాటి డిమాండ్‌చేశారు. 
నిమ్మకాయలకు  గిట్టుబాటుధరలేక తెనాలిమార్కెట్‌ యార్డ్‌లో వాటిని పారబోస్తున్నారని ఆయన చెప్పారు. 151మంది ఎమ్మెల్యేలున్నాకూడా,  తెలుగుదేశం ఎమ్మెల్యేలను లక్ష్యం చేసుకోవడంపై వైసీపీ దృష్టిసారించిందని, టీడీపీ అంటే అధికారపార్టీకి ఎందుకంత భయమని మాజీమంత్రి నిలదీశారు. నాయకులను తయారు చేసే కర్మాగారమైన తెలుగుదేశంపార్టీకి ప్రతిపక్షపాత్ర కొత్తేమీ కాదన్నారు. ఎలా గెలిచాం, ఎందుకు గెలిచామనే సందిగ్ధావస్థలోనే వైసీపీ ఇప్పటికీ కొట్టుమిట్టాడుతోందని, క్షేత్రస్థాయి లో ఇప్పటికీ కార్యకర్తల బలంలేనిస్థితిలో ఆ పార్టీ ఉందన్నారు. త్వరలోనే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తిరిగి బలం పుంజుకొని విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: