సెక్స్ చేయ‌డానికి  కండోమ్‌కు బ‌దులుగా ప్లాస్టిక్ క‌వ‌ర్‌ను వినియోగించిన ఓ ప్రేమ‌జంట చివ‌రికి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంది. ఈసంఘ‌ట‌న వియత్నాం దేశంలోని హనోయ్ ప్రాంతంలో జ‌రిగింది. శృంగార ఉద్రేకంలో కొత్త‌లో ప‌నికానిచ్చిన వారికి కొద్ది సేపటి తర్వాత ఇద్దరికీ మంట‌పుట్ట‌డం మొద‌లైంది.  ప్లాస్టిక్ కవర్ వల్ల వారిద్ద‌రి జననేంద్రియాలు బాగా దెబ్బతిన్నాయి.. రక్తస్రావమయ్యాయి. దీంతో వెంటనే వైద్యుల వద్దకు పరుగెత్తారు.

 

కండోమ్ కొనుగోలుకు సిగ్గుప‌డిన జంట చివ‌రికి ఆస్ప‌త్రి పాలు కావాల్సి వ‌చ్చింది. వాస్త‌వానికి వియ‌త్నం యువ‌త‌లో సెక్స్‌పై అవ‌గాహ‌న త‌క్క‌వ‌ట‌. ఇదే విష‌యం ఇటీవ‌ల‌ హనోయ్ మెడికల్ యూనివర్సిటీ హనోయ్ మెడికల్ కాలేజ్ లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో  కూడా తేల‌డం గ‌మ‌నార్హం. 2700 విద్యార్థులను కండోమ్ వాడకంపై ప్రశ్నిస్తే కేవలం 16శాతం మంది మాత్రమే కండోమ్ వాడామని తెలిపారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనిని బ‌ట్టి కండోమ్ వాడ‌కం అనేది విద్యావంతుల్లో కూడా త‌గ్గిపోతోంద‌ని తెలుస్తోంది.

 

కండోమ్ కొనడానికి తమకు సిగ్గు అని వాడలేదని 25శాతం మంది తెలిపారు.  సెక్స్ అంటేనే అదుకో ర‌హ‌స్య ప‌నిగా వాళ్లు భావిస్తార‌ట‌. అందుకే అక్క‌డి యువ‌త‌లో ముఖ్యంగా స్త్రీల‌లో సెక్స్ అనే ప‌దాన్ని కూడా ఉచ్చ‌రించ‌డానికి మెలిక‌లు తిరుగుతార‌ట‌. భార‌త్‌లాంటి దేశం ఒక‌ప్పుడు ఇలానే ఉన్నా విస్తృత అవ‌గాహ‌న‌, పెరిగిన అక్ష‌రాస్య‌త కార‌ణంగా శృంగార జీవితంపై అవ‌గాహ‌న పెంపొందింద‌నే చెప్పాలి. శృంగారాన్ని ఆస్వాదించ‌డం ఒక క‌ళ‌. అర‌క్షిత ప్ర‌యోగాల‌కు పోయి ప్రాణాల మీద‌కు తెచ్చుకోవ‌ద్ద‌ని వైద్యులు సూచిస్తున్నారు.

 

ఇంట‌ర్నెట్ అందుబాటులోకి వ‌చ్చాక‌...అనేక సైట్లలో సెక్స్ స‌మ‌స్య‌ల‌పై సందేహాలు తీర్చే వైద్యులు ఉంటున్నారు. అంతేకాకుండా ప్ర‌సార మాద్య‌మాల్లోనూ..ముఖ్యంగా హెల్త్ ఛాన‌ళ్ల‌లోనూ వైద్యులు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నార‌ని ఆరోగ్య‌నిపుణులు పేర్కొంటున్నారు. అవగాహన లేకుండా ఏదీ పడితే అది సున్నితమైన జననేంద్రియాల్లో వాడడం డేంజర్ అని వైద్యులు సూచిస్తున్నారు. కండోమే వాడాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: