ఏపీలో  జగన్ సర్కార్ అందరికీ కన్ను కుట్టే మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎంగా ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్నారు. జగన్ పాలన సైతం చాలా  దూకుడుగా సాగుతోంది. ఆయన ఎవరినీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని పోతున్నారు. కేంద్రంలోని బీజేపీ సైతం జగన్ తో కాస్త ఎడం పాటిస్తోందని వార్తలు అయితే వస్తున్నాయి.

ఇక ఏపీలో టీడీపీకి బీజేపీలో కలసిపోవాలని ఉంది. అయితే జగన్ మీద వైసీపీ మీదా  చెడ్డ చెప్పి దూరం పెట్టి ఆ చోటులోకి టీడీపీ రావాలనుకుంటోందని విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు అంటున్నారు. ఆయన అంతటితో ఆగకుండా వైసీపీ సర్కార్ మీద కుట్ర చేస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు.

 

నిజానికి ఏపీలో వైసీపీ మీద అన్ని పార్టీలు మూకుమ్మడి దాడిని పాల్పడుతున్న సంగతి విధితమే. ఏపీలో ఇపుడు  ఇసుక ఎపిసోడ్ క్లోజ్ అయింది. ఇక ఇంగ్లీష్ ముందుకు వచ్చింది. ఇపుడు దానికి మతం మసాలా తగిలించి చెప్పాల్సిన వారికి అన్నీ చెబుతున్నారని అంటున్నారు. జగన్ని, వైసీపీని  ఢిల్లీ పాలకులకు చెడ్డ చేస్తున్నారని మంత్రి అవంతి అభియోగం. నిజానికి ఆరెసెస్, బీజేపీలతో పాటు కేంద్రంతో వైసీపీకి మంచి రిలేషన్లు ఉన్నాయని కూడా మంత్రి అవంతి అంటున్నారు.

 

ఇక ఏపీలో చూసుకుంటే రాజకీయ యుధ్ధం శిఖరాగ్రానికి చేరుకుంది. జగన్ని ఒక్క క్షణం అధికారంలో కూడా ఉంచకూడద‌ని టీడీపీ ప్రయత్నం  చేస్తోందని అంటున్నారు. దానికి ఆ పార్టీ సీనియర్ నేతలు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగులే కారణం. ఎమ్మెల్యేగా పనిచేసిన బోండా ఉమామహేశ్వరరావు జగన్ బెయిల్ సీబీఐ రద్దు చేస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం సంచలనం రేపింది.

 

మరో వైపు జనసేన పవన్ కళ్యాణ్ లాంటి వారు ఏపీ రాజకీయాల్లో జగన్ పరిస్థితి అటు ఇటూ అవుతుందని అంటున్నారు. మరి పవన్ కి ఏ విషయంలో ఎంత తెలుసో, ఆయన  ఏ ఆలోచనతో అలా అన్నారో చూడాలి. ఇంకో వైపు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు వంటి వారు జగన్ ఎపుడు జైలుకు వెళ్తాడోనని ఎద్దేవా చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూంటే ఏదో జరుగుతోందా లేక నిజంగా ఇది టీడీపీ మైండ్ గేమా అన్నది ఎవరికీ అంచనా లేకుండా ఉంది. ఏది ఏమైనా జగన్ మాత్రం తన పని తాను సుకునిపోతున్నారు. చూడాలి మంత్రి అవంతి చెప్పిన  కుట్ర రాజకీయాలు ఎంతవరకు కరెక్టో మరి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: