రాష్ట్ర విభజన తర్వాత కమ్మ సామాజికవర్గం దాదాపు దెబ్బ తినేసినట్లే అనిపిస్తోంది. సమైక్య రాష్ట్రం సమయంలో రాజకీయ రంగంలో  కమ్మ సామాజికవర్గం బలమైన ముద్ర వేసిందనే చెప్పాలి. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుండే ఈ సామాజికవర్గానికి కష్టకాలం  మొదలైందనే చెప్పాలి.

 

ముఖ్యంగా 2014 ఎన్నికల్లో తెలంగాణాలో కేసియార్ సిఎం అవ్వగా ఏపిలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు.  ఇద్దరి మధ్య ఎప్పుడైతే ఓటుకునోటు కేసు వివాదం తలెత్తిందో అప్పటి నుండే తెలంగాణాలో కమ్మోరికి కష్టకాలం మొదలైనట్లే. మొత్తం తెలంగాణాలో అంతకుముందు రాజకీయంగా కమ్మోరి ప్రాబల్యం బాగానే ఉండేది. చంద్రబాబు దెబ్బకు మొత్తం తల్లక్రిందులైపోయింది.

 

తెలంగాణా రాజకీయాల్లో కమ్మోరికి-టిడిపికి మధ్య సంబంధాలను తెగ్గొట్టాలని కేసియార్ కంకణం కట్టుకున్నారు. దాంతో తెలుగుదేశంపార్టీలో ఉన్న కమ్మోరిలో చాలామందిని   పార్టీలోకి చేర్చుకునేశారు. టిఆర్ఎస్ లో చేరటానికి ఇష్టపడని కొందరు బిజెపిలోకి వెళ్ళిపోయారు.

 

 ఇక ఏపి విషయానికి వస్తే కమ్మ సామాజికవర్గానికి నష్టం జరిగిందంటే అది చంద్రబాబు వల్లే అని చెప్పాలి.  టిడిపి వల్ల లాభపడిన కమ్మోరు మహ ఉంటే ఓ 10 వేలమందుంటారు. కానీ నష్టపోయిన వాళ్ళు లక్షల్లో ఉంటారు. వెయ్యిమంది  చేసిన ఓవర్ యాక్షన్ వల్ల కమ్మోరంటేనే మిగిలిన సామాజికవర్గాల్లో వ్యతిరేకత వచ్చేసింది. దాంతో టిడిపిపై వ్యతిరేకత వల్లే వైసిపికి ఓట్లు గుద్దేశారు.

 

సరే చంద్రబాబు పాలన ఎలాగున్నా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఘోర ఓటమిని ఎదురు చూసింది. చంద్రబాబుకు వయస్సై పోవటం, పుత్రరత్నం లోకేష్ పై ఎందుకూ పనికిరానివాడనే  ముద్ర పడటంతో టిడిపికి  భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇందులో కూడా కమ్మోరి శాతమే ఎక్కువుండటం విచిత్రం.

 

దానికితోడు అధికారం పోగానే సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు లాంటి కమ్మ రాజ్యసభ ఎంపిలను స్వయంగా చంద్రబాబే బిజెపిలోకి పంపేశారు. దాంతో టిడిపిపై ఉన్న కాస్త నమ్మకం కూడా పోయి చాలామంది బిజెపిలోకి వెళిపోతున్నారు. అన్నం సతీష్ ప్రభాకర్, మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి లాంటి వాళ్ళు బిజెపిలో చేరారు. ఇంకా చాలామంది రెడీగా ఉన్నారట.  దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ లాంటి మరికొందరు కమ్మోరు వైసిపిలో భవిష్యత్తును వెతుక్కుంటున్నారు లేండి. మొత్తం మీద రెండు రాష్ట్రాల్లోను కమ్మ నేతలు మాత్రం దారుణంగా దెబ్బ తినేసినట్లే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: