వైసీపీ అధినేతగా ఏపీ సీఎంగా జగన్ సమర్ధవంతంగా తన విధులు నిర్వర్తిస్తూ ఏపీలో పరిపాలనను ఒక గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఇప్పటివరకు ఏ సీఎం చేయని సాహసమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. దీనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయినా జగన్ లో ఎక్కడా ఆ ఆనందం కనిపించడమే లేదు. దీనికి కారణం తన పరిపాలనపై ఎంత సానుకూలత వస్తుందో అంతే స్థాయిలో వ్యతిరేకత వస్తుండడం జగన్ కు ఇబ్బందికరంగా మారింది. ఏపీలో తమ రాజకీయ ప్రత్యర్థులంతా చిన్న చిన్న సమస్యలను సైతం పెద్దవిగా చూపుతూ ప్రజల్లో వైసీపీ ప్రభుత్వ పరువు బజారున పడేస్తున్నారు. ఇక మీడియాలో కూడా జగన్ కు వ్యక్తిరకంగా అనేక అనేక కథనాలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్టు జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేక కథనాలు వస్తుండడం జగన్ కు చికాకు తెప్పిస్తోంది. 

 

ఇదే సమయంలో కొంతమంది ఎంపీలు బీజేపీలోకి వెళ్లే ఉద్దేశంతో తన మాట కూడా లెక్క చేయడం లేదు అనే బాధ జగన్ లో ఎక్కువ కనిపిస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నుంచి బీజేపీలోకి వలసలు పెరిగితే రాజకీయంగా తనకు చిక్కుల్లో పడతానని జగన్ భయం. అందుకే ఇప్పుడు తమ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపుతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ మరింత డ్యామేజ్ అవ్వకుండా నష్ట నివారణ కోసం జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. రాజధాని అమరావతిలో సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టును జగన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో దానిని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, జర్నలిస్ట్‌లు తప్పుబడుతున్నారు. అంతేకాదు ప్రముఖ దినపత్రిక ఎకనామిక్స్ టైమ్‌లో తిరొగమన రాజకీయాలు అంటూ జగన్ పాలనపై ఏకంగా ఒక ఎడిటోరియల్‌నే రాసుకొచ్చేసింది. 

 

ఇదే సరైన అనువైన సమయంగా భావిస్తున్న జగన్ వ్యక్తిరేక శక్తులు మరింతగా తమ రాజకీయాలకు పదును పెట్టాయి. జాతీయ మీడియాలో వచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ ట్విట్లు పెడుతూ ఏపీ పరువు ప్రతిష్టతను తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని కాస్త సీరియస్‌గా తీసుకున్న జగన్ దానిని సరిదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టారు.జాతీయ మీడియా సలహాదారుడిగా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్‌ను జగన్ నియమించుకున్నప్పటికి జాతీయ మీడియాలో వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇకపై జాతీయ మీడియా వ్యవహారాలన్నిటిని ఐ ప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్‌కు అప్పగించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై జగన్ జాతీయ మీడియా వ్యవహారాలతో పాటు రాష్ట్ర రాజకీయాలకు సంబందించిన అన్ని అంశాలను పీకే టీమ్ పర్యవేక్షించేందుకు ఒప్పందం జరిగిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: