హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి హాస్టల్ లో ఉంటున్న 24 ఏళ్ల హరిణి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తన రుమ్ లో చున్నీతో ఉరి వేసుకొని మరణించింది. మాదాపూర్‌లోని క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్న హరిణి తన ఉద్యోగం పోతుందన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.  

              

కాగా రెండు సంవత్సరాల నుండి మాదాపూర్ లో ఉన్న క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా పనిచేస్తుంది. అయితే సంస్థ ఒప్పందం ప్రకారం డిసెంబర్ నెలతో ఉద్యోగం గడువు ముగియనుండటంతో ఉపాధి కోల్పోతాననే మనస్తాపానికి గురై హాస్టల్ లో నే చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు  ఆమె సన్నిహితులు చెబుతున్నారు. 

              

కాగా పోస్టుమార్టం నిమిత్తం భౌతికాయాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే రెండేళ్ల నుంచి అదే కంపెనీలో పని చేస్తున్న హరిణి ఉద్యోగం కాంట్రాక్టు ముగుస్తుండటంతో తన భవిష్యేత్తు ఏంటి అని అలోచించి మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. కేవలం ఈమె ఉద్యోగమే కాదు ఐటీలో దాదాపు 40 వేల మందిని ఉద్యోగాల నుండి తొలిగిస్తున్న విషయం తెలిసిందే. 

         

ప్రస్తుతం ఈమె ఆత్మహత్య గచ్చిబౌలిలో కలకలం సృష్టిస్తుంది. అయితే హరిణి ఏ నగరానికి చెందిన ఆమె అనేది ఇంకా పోలీసులకు తెలియలేదు.. కాగా ఈ ఘటనను పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఈమె ఆత్మహత్య ఉద్యోగం కోసమేనా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.              

మరింత సమాచారం తెలుసుకోండి: