సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది! మానవత్వానికి మచ్చతెచ్చే దారుణ ఉదంతమిది! తల్లీ కూతుళ్ల బంధానికి మాయని మచ్చగా మారిన గాయమిది! ఏ తల్లి చేయకూడని ఘోరాన్ని ఆ తల్లి చేసింది. రక్తం పంచుకు పుట్టిన కూతురిని తన సుఖం కోసం మరొకరికి అలవాటు చేసింది. చివరికి తన కూతుళ్ల చేతిలోనే హతమైంది. వావివరసలు మరచి ఆ మహిళ పెట్టుకున్న అక్రమ సంబంధమే ఆమె పాలిట శాపమైంది.

 

 

కన్న తల్లి మరణిస్తే కంట తడి పెట్టుకోవలసిన కూతుళ్లు ఆ తల్లినే స్వయంగా కాటికి పంపించారు. ఈ ఘటన నల్లగొండ రూరల్‌ మండలం అప్పాజీపేటలో జరిగింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. అప్పాజీపేటలో నివసించే కల్లూరి సత్యమ్మ(55)కు ఇద్దరు కూతుళ్లు. భర్త చనిపోవడంతో తానే కష్టపడి పిల్లలను పెంచి పెద్దచేసింది. ఇక పెళ్లి వయస్సు వచ్చిన పెద్దకూతురికి అప్పుచేసి వివాహం చేసి పంపింది.

 

 

ఆ అప్పులు తీరే మార్గం కనబడక ఆ సమయంలోనే అదే గ్రామానికి చెందిన కురాకుల యాదయ్య అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక ఆస్తిపరుడైన యాదయ్య తరుచూ ఆమెకు అడిగినంత ఆర్థిక సాయం చేస్తు ఆమె కూతురిని కూడ కోరుకోవడంతో ఏ తల్లి చేయని నీఛమైన పనికి దిగజారి తన రెండో కూతురు రుద్రమ్మను కూడా అతడి వద్దకు పంపేది.

 

 

ఈ క్రమంలో రుద్రమ్మ రెండుసార్లు గర్భం దాల్చడంతో సత్యమ్మ ఆమెకు అబార్షన్ చేయించి చివరికి యాదయ్యకిచ్చి పెళ్లి చేసింది. ఆ తర్వాత సంవత్సరానికే వారికి ఓ పాప పుట్టింది. అయినా కాని అల్లుడైన తర్వాత కూడా అతనితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న సత్యమ్మ పట్ల ఇద్దరు కూతుళ్లూ కోపాన్ని పెంచుకుని తల్లి కారణంగా తమ జీవితాలు నాశనమయ్యాయని భావించిన ఆ అక్కాచెల్లెళ్లు ఆమెను చంపేయాలని నిర్ణయానికి వచ్చారు.

 

 

ఈ క్రమంలో చండూరు మండలం నెర్మటకు చెందిన జంగయ్యతో ఒప్పందం చేసుకుని రూ.20వేల సుపారీ ఇచ్చారు. ఈ దశలో  జంగయ్య, కూతురూ రుద్రమ్మ అప్పాజీపేటలోని సత్యమ్మ ఇంటికి వెళ్లి తలుపు గడియపెట్టి సత్యమ్మను కింద పడేసి హత్యచేసారు. తర్వాత ఇంట్లో ఉన్న రూ.30వేల నగదు, 3తులాల బంగారం, 50తులాల వెండి ఆభరణాలను తీసుకుని వారిద్దరూ పరారయ్యారు.

 

 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే మృతురాలి కుమార్తెలిద్దరూ ఈ నేరం తామే చేశామంటూ స్థానిక ప్రజాప్రతినిధి ఎదుట లొంగిపోయారు. ఆయనిచ్చిన సమాచారంతో పోలీసులు ఆండాళ్లు, రుద్రమ్మతో పాటు జంగయ్యను కూడా అరెస్ట్ చేశారు. చూసారా ఓ క్షణం సుఖం ఎన్ని ప్రమాదాలను తీసుకొచ్చిందో. ఎన్ని జీవితాలను నాశనం చేసిందో. చిన్నప్పటి నుండి పెంచిన తల్లిని కూడా దూరం చేసుకునే పరిస్దితులను విధి కల్పించింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: