సికింద్రాబాద్ లోనే కాకుండా జంటనగరాల్లోనే అడ్డగుట్ట ప్రాంతాన్ని  ఆదర్శ బస్తీ గా సర్వ సదుపాయాలతో తీర్చిదిద్దుతామని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. 50 సంవత్సరాల్లో చేపట్టని ఎన్నో పనులను కేవలం 5 సంవత్సరాల్లో ప్రారంభించామని, రానున్న ఐదేళ్ళలో అడ్డగుట్టలో అభివృధి పనులన్నీ పూర్తవుతాయని అయన తెలిపారు. అడ్డగుట్ట డివిజన్లో వివిధ అభివృధి పనులను అయన బుధవారం ప్రారంభించారు. బీ సెక్షన్ లో రూ. 19 లక్షల ఖర్చుతో  పిల్లల పార్కు ఏర్పాటు పనులను, వెంకట్ నగర్, బీ సెక్షన్, ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్స్ లో రూ. 13 లక్షల ఖర్చుతో అభివృధి పనులను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. 

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... అడ్డగుట్టలో 900 చదరపు మీటర్ల స్థలంలో  రూ.2.25 కోట్ల మేరకు నిధులను కొత్త బ‌హుళ సౌక‌ర్యాలు ఫంక్షన్ హాల్ నిర్మాణానికి మంజూరు చేసినట్లు పద్మారావు గౌడ్ వివరించారు. అన్ని రోడ్ల పునర్నిర్మాణం, మరమ్మతు పనులకు నిధులను మంజూరు చేశామని తెలిపారు.  అడ్డగుట్ట లో మౌళిక వసతుల కల్పనకు ఇప్పటికే ఏర్పాట్లు జరిపామని, మంచి నీటి ఎద్దటి నివారణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. సికింద్రాబాద్ లో రికార్డు సంఖ్యలో 180 పవర్ బోరింగ్లను కేవలం ఐదేళ్ళ కాలంలో ఏర్పాటు చేశామని వివరించారు.  పద్మారావు గౌడ్ పర్యటన సందర్భంగా పలువురు స్థానికులు వివిధ సమస్యలను ఏకరువు పెట్టగా వాటిని వెంటనే పరిష్కరించేలా ఏర్పాట్లు జరపాలని అధికారులకు ఆదేశాలు జారి చేశారు. బీ సెక్షన్ లో మంచి నీటి సరఫరాను మెరుగు పరచేందుకు రూ. 23 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు పద్మారావు గౌడ్ తెలిపారు. 

 

అదే విధంగా వెలుగని వీధి దేపాల మరమత్తు లు చేపట్టాలని, ఓపెన్ నాలా సమస్య పరిష్కరించాలని,  విధ్యుత్ స్థంబాలను మార్చాలని, సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలనీ, శాస్త్రి నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అనువైన స్థలం గుర్తించాలని  ఈ సందర్భంగా  ఆయ‌న ఆదేశించారు.  జిహెచ్ ఎం సి జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ రవికుమార్, ఎమ్మార్వో సునీల్, కార్పొరేట‌ర్లు విజయ కుమారి, అలకుంట్ సరస్వతి, ఈ ఈ ప్రమోద్ కుమార్ లతో పాటు వివిధ విభాగాల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: