గన్నవరం...2019 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ కంచుకోటే...కానీ ఇప్పుడు పరిస్తితి చూస్తుంటే అలా అనిపించడం లేదు. గుడివాడ మాదిరిగా గన్నవరం కూడా టీడీపీ చేతుల నుంచి జారిపోయినట్లు కనిపిస్తోంది. 2009 వరకు గుడివాడ టీడీపీకి కంచుకోటగానే ఉంది. కానీ ఎప్పుడైతే కొడాలి నాని వైసీపీలోకి వెళ్లారో అప్పటి నుంచి వైసీపీ అడ్డాగా మారింది. అక్కడ టీడీపీ కేడర్ ఎక్కువ శాతం నాని అభిమానులుగా మారిపోయారు. టీడీపీలో ఉండగానే నాని మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఆ ఫాలోయింగ్ వల్లే నాని 2014, 2019 ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించగలిగారు.

 

టీడీపీ, వైసీపీలకు కేడర్ ఉన్న నానికి సెపరేట్ కేడర్ ఉంది. దాని వల్ల నానికి గుడివాడలో తిరుగులేకుండా పోయింది. అందుకే అక్కడ నానికి చెక్ పెట్టడం టీడీపీ వల్ల కావడం లేదు. ఇక అలాగే గన్నవరంలో కూడా పరిస్తితి వచ్చేలా ఉంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున గెలిచిన వంశీ... నియోజకవర్గంలో మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. 

 

టీడీపీని అభిమానిస్తూనే వంశీకి కొందరు వీరాభిమానులుగా మారిపోయారు. దీంతో వారు వంశీతో పాటే వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇటీవలే వంశీ టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అటు వైసీపీలో చేరడానికి కూడా లైన్ క్లియర్ అయిపోయింది. కాకపోతే ఎప్పుడు చేరతారనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే వైసీపీలో చేరేప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వెళ్లతారు. కాబట్టి అక్కడ ఉపఎన్నిక వచ్చే అవకాశముంది. 

 

అయితే ఉపఎన్నిక వచ్చిన రాకపోయిన వంశీ ఇకనుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారు. ఆయన వైసీపీ వైపు ఉంటే కొంత టీడీపీ కేడర్ కూడా ఆయనకు మద్ధతు తెలపడం ఖాయం. అంటే గుడివాడ మాదిరిగానే ఇక్కడ టీడీపీ, వైసీపీలకు ఓ కేడర్ ఉంటూనే...వంశీకి కూడా ప్రత్యేక కేడర్ ఉంటుంది. అదే వంశీని విజయం వైపు నడిపిస్తోంది. దీని బట్టి చూసుకుంటే టీడీపీ ఖాతాలో మరో కంచుకోట చేజారిపోయినట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: