అబ్బబ్బా .. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎప్పుడు హైఅలెర్ట్ ఉండమంటారు.. ఏంటో అని అనుకుంటుంటారు.. ప్రజలు ఈ టైటిల్ చదవగానే... కానీ ఎం చేస్తాం. వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తే అలాగే చెప్పాలికి కదా.. సరే. ఇంకా విషయానికి వస్తే.. ఇప్పుడు చలి కాలం మొదలయ్యింది. అందుకే ఈ హెచ్చరికలు. 

                  

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ నిన్న బుధువారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది చలి తీవ్రత మునపటి కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పింది. డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి 15 వరుకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అయితే ఇప్పుడు కూడా చలి తీవ్రత పెరిగింది అని తెలిపింది. 

               

అయితే ఈ ఏడాది రెండు తుఫాన్లు వచ్చినప్పటికీ అవి చైనా, మలేసియా వైపు వెళ్లిపోయాయి అని, అరేబియా సముద్రంలోనే ఈ రెండు తుఫాన్లు ఏర్పడ్డాయి అని, ఈ కారణంగా బంగాళాఖాతానికి అనుకుని ఉన్న రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. 

              

అయితే ఈసారి ప్రజలను వాతావరణం చాలా ఇబ్బందులకు గురి చేసింది, చేస్తుంది. వేసవి కాలంలో అతిగా ఎండలు రావడం వల్ల ప్రజలు వేడికి గిలగిలా కొట్టుకొని వడ దెబ్బకు మరణించారు. ఇంకా వర్ష కాలంలో అతి భారీ వర్షాలు కురిసి ప్రజలకు రోగాలు తీసుకొచ్చి పెట్టింది. ఈ వర్షం, ఎండ, చలి అన్ని అతివృష్టి, అనావృష్టిలా తయారు అయ్యాయి. వస్తే అతిగా వస్తాయి.. లేకుంటే అస్సలు రావు. ఈ కాలంలో వాతావరణం ప్రజలతో ఆడుకుంటుంది అని చెప్పచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: