కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది.  దేశాన్ని రక్షించేందుకు మూడు దళాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి.  త్రివిధ దళాలకు ముగ్గురు బాస్ లు ఉంటారు.  ఏదైనా ఆపద వచ్చినపుడు ఆ మూడింటిని అనుసంధానం చేస్తూ నిర్ణయాలు తీసుకోవాలి.  ఇది ఒక్కోసారి  అంశంగా మారుతుంది.  ఫలితంగా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది.  అందుకోసం కేంద్రం ఓ నిర్ణయం తీసుకోబోతున్నది.  


ఇప్పటికే ప్రధాని మోడీ దీనిపై గతంలోనే ఓ ప్రకటన చేశారు.  దేశంలో మూడు దళాలకు ఒక బాస్ ను నియమించాలని నిర్ణయించినట్టు మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే.  రక్షణ దళాల అధిపతి సిడిఎస్ పేరుతో ఓ అధిపతిని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధంఅవుతున్నది.  జాతీయ  భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ నేతృత్వంలో ఓ కమిటీ దీనిపై ఇప్పటికే ఓ నివేదికను సిద్ధం చేసింది.  


ఎవరిని త్రివిధ దళాల అధిపతిగా నియమించాలి అనే అంశంపై ఇప్పటికే నిర్ణయం.  ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ పదవీకాలం డిసెంబర్ 31 తో ముగియనున్నది.  ఆయన్ను సిడిఎస్ గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.  దీనికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.  బిపిన్ ఈ విషయంలో చాలా అగ్రెసివ్ గా ఉంటాడు.  అయన నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి.  అలాంటి వ్యక్తులే త్రివిధ దళాలకు అధిపతిగా ఉండాలి అని ప్రభుత్వంభావిస్తోంది. 


జనవరి 1 నుంచి సిడిఎస్ విధానం అమలులోకి వస్తుండటం విశేషం.  మూడు దళాలకు ఒక్కరే బాస్ గా ఉంటె.. నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది.  అప్పుడు త్రివిధ దళాలు మరింత సమర్ధవంతంగా ధైర్యంగా అడుగు వేస్తాయి.  ఇక ఇండియా తీసుకోబోతున్న సిడిఎస్ విధానంపై భయపడుతున్నది.  ఒక్కరే బాస్ ఉంటె, అందులోను బిపిన్ బాస్ గా వస్తున్నాడు అని తెలిసిన పాక్ మరింత అప్రమత్తంగా ఉన్నది.  గతంలో తమ సైన్యం సిద్ధంగా ఉందని, చిన్న అవకాశం ఇస్తే, పీవోకే ను కలిపేసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు.  ఇది పాక్ ను కలవరపెడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: