శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇప్పటికే దేవస్థానంను తెరిచారు.  ఇటీవలే ఓపెన్ చేసిన ఈ ఆలయం జనవరి 16లేదా 17 వ తేదీ వరకు తెరిచే ఉంటుంది.  ఆ తరువాత అయ్యప్ప ఆలయాన్ని మూసివేస్తారు.  ఈ కార్తీకమాసంలో అయ్యప్ప మాల వేసుకొని 41 రోజులపాటు దీక్ష చేపట్టి అయ్యప్పలు శబరిమలకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని వస్తుంటారు.  


ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు కేరళలో ఉన్న అయ్యప్ప ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొని వస్తుంటారు.  ఇక ఆలయం తెరిచిన తరువాత ఆలయంలో పడిపూజను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు.  ఈ ఉత్సవం ఐదు రోజులపాటు జరుగుతుంది.  ఈ వేడుకలో పూజ చేయించుకోవాలి అనుకునే వ్యక్తులు ఆలయంలో రూ. 75 వేలరూపాయలు డిపాజిట్ చేయాలి.  అలా డిపాజిట్ చేసిన వాళ్లకు ఈ సౌకర్యం ఉంటుంది.  


దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే పూర్తయ్యాయి.  ఒక్క ఈ ఏడాది మాత్రమే కాదు.  2050వ సంవత్సరం వరకు దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది.  2050 వరకు ఆలయంలో బుకింగ్స్  పూర్తయ్యాయని ఆలయ అధికారులు చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఈ సంవత్సరం నుంచి ఆలయంలోకి మహిళలను కూడా అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.  


ఆలయ కట్టుబాట్లను అనుసరించి ఆలయంలోకి పిల్లలను, 50 సంవత్సరాలు దాటిన మహిళను మాత్రమే అనుమతి ఇస్తున్నారు.  అందరికి ఆలయ ప్రవేశం కలిగించడం లేదు.  దీనిపై మహిళలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.  ఆలయంలో మహిళలను ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన.. ఆలయ నియమాల ప్రకారం వారిని అనుమతించడం లేదు.  అయితే, దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఉన్న విధానాన్ని శబరిమలలో కూడా ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: