వైసీపీ సర్కార్ ఇపుడు కొత్త కేసులతో సతమవుతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లకు చెందిన ఎమ్మెల్యే శ్రీదేవి  ఎస్సీ కులంపై చెలరేగిన వివాదంలో ఈ నెల 26న జాయింట్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఆమె ఎస్సీ కులం ఆధారాలతో సహా విచారణకు రావాలని కూడా కోరారు. దీని మీద రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎన్నికల కమిషన్ కి ఆదేశాలు రాగా ఏపీ ఎన్నికల సంఘం విచారణ అధికారిగా జేసీని నియమించిన సంగతి విధితమే.

 

ఇదిలా ఉండగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  చెల్లుబాటు కాని కుల ద్రువీకరణ పత్రంలో ఆమె ఎస్టీ నియోజకవర్గమైన కురుపాం నుంచి పోటీ చేశారని, ఆమె ఎన్నిక రద్దు చేయాలని దాఖలు అయిన  పిటిషన్ మీద విచారించిన హైకోర్టు ఈ మేరకు పుష్ప శ్రీవాణీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నోటీసులు పంపారు. ఆమె ఎస్టీ కుల ద్రువీకరణ పత్రం పొందారని  పిటిషనర్లు గా ఉన్న మాజీ ఎమ్మెల్యే జయరాజు పిటిషన్ జారీ చేశారు.

 

ఇవన్నీ చూస్తూంటే కుల ద్రువీకరణ విషయంలో కధ ఎంతవరకూ వెళ్తుందోనన్న కంగారు వైసీపీలో ఉంది.  ఇక పుష్ఫ శ్రీవాణి పెద మామ, మాజీ మంత్రి అయిన శత్రుచర్ల విజయరామరాజు ఎస్టీ కుల సర్టిఫికేట్ల విషయంలోనే కోర్టు విచారణను ఎదుర్కొన్నారు. చివరికి ఆయన ఎస్టీ కాదని తీర్పు వచ్చింది.  మరి ఇపుడు గోదావరి జిల్లాలకు చెందిన ఎస్టీ అయిన పుష్ప శ్రీవాణిని శత్రుచర్ల తమ్ముడు చద్రశేఖరరాజు తన ఇంటికి కోడలిగా తెచ్చుకున్నారు.

 

తమ కుమారుడు పరీక్షిత్ రాజు కు ఆమెను ఇచ్చి పెళ్ళి చేశారు. అంతకు ముందు రాజకీయాలు తెలియకపోయినా శత్రుచర్ల కుటుంబం కోడలిగా ఆమె కురుపాం నుంచి ఇప్పటికీ రెండు సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇపుడు ఏకంగా డిప్యూటీ సీఎం గా ఉన్నారు. మరి హైకోర్టు విచారణలో పుష్ప శ్రీవాణి ఎస్టీ కుల వివాదం ఏ మలుపు తీసుకోనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: