సొంత ఇల్లు అన్నది ప్రతి ఒక్కరి కల.. ఆ కలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరు విపరీతంగా కృషి చేస్తుంటారు.  కలగన్న ప్రతి ఒక్కటి నెరవేరాలని కోరుకుంటారు.  అయితే, అన్ని నెరవేరుతాయా అంటే నెరవేరవు అని చెప్పాలి.  అన్నింటిని నెరవేర్చుకోవాలి అంటే.. దానికి తగిన విధంగా కృషి చేయాలి.  తగినట్టుగా సంపాదించాలి.  ఒక్కోసారి ఇల్లు కట్టాలని కోరిక ఉండి, చేతిలో డబ్బులు ఉండి కూడా వాటిని కట్టలేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు.  
కొంతమంది ఇల్లు కట్టుకుంటే, వారికి పునాదుల్లో  దొరుకుతుంటాయి. ఆ నిధులను ప్రభుత్వం తీసుకుంటుంది.  కొంతమంది ఎవరికీ చెప్పకుండా వాటిని దాచేసుకుంటారు అనుకోండి.. అది వేరే విషయం.  భూమిలో దొరికింది కాబట్టి తమదే అని బుకాయించేస్తుంటారు.  ఇలాంటి వ్యక్తులు కోకొల్లలుగా ఉన్నారు.  ఇంకొందరికి వేరుగా ఉంటుంది.  వాళ్ళది దరిద్రం అనాలో లేక మరేమి అనాలో తెలియదుగాని, చాలా ఇబ్బందులు పడుతుంటారు.  
అందులో ఒకటి ఇది.  పాపం అతనికి ఎన్నాళ్ళ నుంచో ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉన్నది.  ఎలాగోలా డబ్బులు పోగు చేసుకున్నాడు.  తనకు ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తవ్వాడు.  తవ్విన పునాదుల్లో వాటిని చూసి షాక్ అయ్యాడు.  ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నాడు.  ఇంతకీ అయన ఇంటి పునాదుల్లో బయటపడింది ఏంటి అని షాక్ అవుతున్నారా అక్కడికే వస్తున్నా.. 
ఇంటి పునాదుల్లో బయటపడింది మరెంటో కాదు నీళ్లు.. నీళ్లు బయటపడ్డాయి.  నాలుగు అడుగుల లోతులోనే నీళ్లు పడుతున్నాయి. మాములుగా ఆ ఏరియాలో ఎంతో లోతుగా తవ్వితేనేగాని నీళ్లు బయటకు రావు.  అలాంటిది కొద్ది లోతు తవ్వగానే నీళ్లు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  ఈ సంఘటన సూర్యాపేటలోని శ్రీరామ్ నగర్ లో జరిగింది.  30 అడుగుల బోర్లు తవ్వితే.. మోటార్ అవసరం లేకుండానే నీరు పైకి ఉబికి రావడం, మురికి నీరు కోసం చిన్న కాలవ తవ్వినా నీరు ఉబికి వస్తుండటంతో అక్కడి ప్రజలు షాక్ అవుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: