ఏపీ రాజధాని విషయంలో జరుగుతున్న రగడ విషయం మనందరికి తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ విషయమై చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ఇక ఇప్పటి వరకు ఏపీ రాజధాని విషయంలో జగన్ ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇకపోతే రాజధాని నిర్మాణం విషయమై ఇది వరకు  జగన్ నియమించిన జీఎస్ రావు కమిటి ఈ నెలాఖరులోగా  తన నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం.

 

 

కాగా ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఎలాగున్నా తమ పర్యటన వివరాలు, తమ అభిప్రాయాలను ఎలాగూ కమిటి జగన్ కు వివరిస్తుంది. దాని ఆధారంగా డిసెంబర్ లో జగన్ ఓ ప్రకటన చేయచ్చని సమాచారం. ఇక ప్రస్తుతం అందిన సమచారం ప్రకారం ఇదివరకు  వెలగపూడిలో చంద్రబాబునాయుడు నిర్మించిన తాత్కాలిక నిర్మాణాల ప్రాంతంలో మాత్రం ఈ నిర్మాణాలు ఉండవని, మంగళగిరికి సమీపంలో జగన్ చేయబోయే శాస్వత నిర్మాణాలు  ఉంటాయని. అలాగే అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ నిర్మాణాలు కూడా అక్కడ జరిగే అవకాశం ఉంటుందని తెలిసింది..

 

 

ఇకపోతే ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకుంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటి పరిసర ప్రాంతాల్లో శాస్వత నిర్మాణాలు చేయలనే ప్రతిపాదనలు ఎక్కువగా వచ్చాయట. అందుకనే రాజ్ భవన్ కూడా ఒకవేళ ఇక్కడ నిర్మించే అవకాశం ఉందై ప్రచారం జరుగుతోంది. ఇక హై కోర్టు సంగతే తెలియవలసి ఉంది..

 

 

ఇప్పటి వరకు ఉన్న ఊహాగానాల ప్రకారం హై కోర్టును కర్నూలుకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇప్పటికే కొన్ని భవనాలు అక్కడున్నాయి. కాకపోతే వాటికి కాస్త మర్మతులు చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారట.

 

 

మొత్తానికి జగన్ ఆలోచనల ప్రకారం అధికార వికేంద్రీకరణ జరగబోతోందని సమాచారం. అభివృద్ధి అన్నీ ప్రాంతాలకు విస్తరించాలని జగన్ నిర్ణయించారు. కాబట్టి ఇదే విషయాన్ని డిసెంబర్లో ప్రకటించబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం...  

 

మరింత సమాచారం తెలుసుకోండి: