ఈ మాట వింటుంటే అబ్బా..ఆ నోట్ల కట్ట వర్షమేదో మా వద్ద జరిగితే బాగుండే అనుకుంటారు..నిజమే డబ్బు ఎవరికి చేదు. కాకపోతే ఈ సంఘటన నిజమే.. భవనం పైనుంచి నోట్ల కట్టల వర్షం కురిసింది...కానీ ఇక్కడ కాదు కలకత్తాలో జరిగిందీ ఘటన. ఇక అసలు విషయానికి వస్తే..కలకత్తాలోని ఓ వాణిజ్య భవనం కిటికీ నుంచి నోట్ల వర్షం కురిసింది. డైరెక్టరెట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం మధ్యాహ్నం కలకత్తాలోని బిజినెస్ జిల్లా బెంటిక్ స్ట్రీట్‌లో ఉన్న హోక్ మర్చంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై దాడులు నిర్వహించారు. 

 

అయితే దాడులు జరుగుతాయని ముందు పసిగట్టిన ఆ కంపెని సిబ్బంది అధికారుల రాకను గమనించిన కంపెనీ సిబ్బంది కార్యలయంలో ఉన్న రద్దైన నోట్లు 1000, 500, మరియు 100 రూపాయల కట్టలను కిటికీ నుంచి కిందికి విసిరేసింది. ప్రస్తుతం హోక్ మర్చంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ నిర్వహిస్తుంది.  అయితే ఉన్నట్టుండి పై నుంచి నోట్లు పడటం చూసి షాక్ కి గురైన ఓ ఔత్సాహికుడు ఆ సీన్ ని తన కెమెరాలో బంధించాడు.  కంపెనీ సిబ్బంది కార్యలయంలో ఉన్న రద్దైన నోట్లు 1000, 500, మరియు 100 రూపాయల కట్టలను కిటికీ నుంచి కిందికి విసిరేసింది.  

 

ప్రధాని నరేంద్ర మోదీ తన పాలనలో తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఒకటి పెద్ద నోట్ల రద్దు.  ఇల్లీగల్ వ్యవహరాలు, దొంగ నోట్లను అరికట్టేందుకు రూ.1000, 500 వదల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.  అప్పట్లో పాత నోట్ల మార్పు, కొత్త నోట్ల గురించి దేశ వ్యాప్తంగా నానా ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. కాకపోతే ఆ కష్టాలు రెండు నెలలు పడ్డా తర్వాత అంతా సర్ధుమణిగింది. అయితే అప్పుడప్పుడు మాత్రం పాత నోట్ల వ్యవహారాలు ఇంకా బకట పడుతూనే ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  దీనిపై స్పందించిన డీఆర్ఐ అధికారులు మాత్రం సోదాలకు, నోట్ల కట్టలు పడేయటానికి సంబంధం లేదని అంటున్నారు.  పోలీసులు ఈ ఘటనపై దీనిపై విచారణ జరుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: