గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నా విషయం తెలిసిందే. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు క్లారిటీ ఇచ్చి టిడిపి అధినేత చంద్రబాబు నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టీడీపీ తెలుగు యువత విభాగం అధ్యక్షుడు దేవినేని అవినాష్ టిడిపి కి స్వస్తి పలికి వైసిపి తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే దేవినేని అవినాష్ వైసిపిలో చేరడం చంద్రబాబుకు మరో షాక్ తగిలినట్లయింది. అయితే టిడిపిలో పదవులకు నాయకులకు సరైన గౌరవం లేదని జగన్ ప్రభుత్వం పథకాలు పాలన నచ్చడం వల్లే వైసీపీలో చేరుతున్నట్లు దేవినేని అవినాష్ తెలిపారు. కాగా  దేవినేని అవినాష్ తో పాటు 500 మంది కార్యకర్తలు టిడిపి నుంచి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో జగన్ దేవినేని అవినాష్ కు హామీ ఇవ్వడం దేవినేని టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

 

 

 అందరూ అనుకున్నట్టుగానే జరిగింది... టిడిపికి గుడ్బై చెప్పి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ కు పదవి కట్టబెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. దేవినేని అవినాష్ కు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా దేవినేని అవినాష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు దేవినేని అవినాష్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి  స్థానిక సంస్థల ఎన్నికల్లో  పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తానంటూ దేవినేని అవినాష్ తెలిపారు. టిడిపిలో తనకు అన్యాయం జరిగిందని దేవినేని అవినాష్ మరోసారి ఆరోపించారు భుజంపై చేయి వేసి అంతమాత్రాన న్యాయం జరిగినట్లు కాదని ... వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సహా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మీద ఉన్న నమ్మకంతోనే వైసీపీ పార్టీలో చేరినట్లు దేవినేని అవినాష్ తెలిపారు. 

 

 

 

 వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి బాధ్యతలు అప్పగించిన సమర్థవంతంగా నిర్వహిస్తానని తనను  పార్టీలోకి చేరేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు అంటూ  దేవినేని అవినాష్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అభిమానులను కలిశారు దేవినేని అవినాష్. అయితే తనకు  అభిమానులు కార్యకర్తల ఆశీర్వాదమే బలం అని  ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో... నియోజకవర్గానికి ఇంఛార్జిగా ఉన్న బొప్పన భవన  కుమార్  పరిస్థితి ఏంటని ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అదే నియోజకవర్గ ఇన్చార్జిగా వైసీపీ  సీనియర్ నేత ఎలమంచిలి రవి కూడా ఉండడంతో వీరిద్దరు అవినాష్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో ఎలా స్పందిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: