కేసీఆర్‌ దత్తపుత్రుడు జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రరాష్ట్రానికి చెందిన పెట్టుబడులను  , పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను వెళ్లగొడుతుంటే, కేసీఆర్‌ సొంతపుత్రుడు కేటీఆర్‌ వారిని సాదరంగా తెలంగాణకు ఆహ్వానిస్తున్నాడని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి శ్రీమతి పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి వైఖరిచూస్తుంటే, ఆయన కేసీఆర్‌కు ప్రత్యేకప్రతినిధిగా పనిచేస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. పరిశ్రమ లు రాకుండా చేయడం ద్వారా, రాష్ట్రంలోని నిరుద్యోగులను, యువతను జగన్‌ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌చేశారు. 


చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి దేశవిదేశాలు తిరిగి నవ్యాంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకొచ్చారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39వేల పరిశ్రమలను చంద్రబాబు గ్రౌండ్‌చేయించారని, తద్వారా 5.50లక్షల ఉద్యోగాలు వచ్చా యని అనురాధ తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో 5.50లక్షల ఉద్యోగాలు వచ్చాయని జగన్‌ ప్రభుత్వమే శాసనమండలిలో ఒప్పుకుందన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులను గాలికొదిలేసిన జగన్‌సర్కారు, వైసీపీకార్యకర్తలకు ఉద్యోగాలిచ్చి, వారికి ఏటా రూ.7200కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేస్తోందన్నారు. 

వైసీపీప్రభుత్వ వైఖరివల్ల రూ.15వేల కోట్ల పెట్టుబడి పెడతామని ముందుకొచ్చిన రిలయన్స్‌తోపాటు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, రూ.2,200 కోట్లు పెట్టబడితో 7,000 ఉద్యోగాలు ఇస్తామన్న లులూ కంపెనీ, రూ.70వేల కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన ఆదానీగ్రూప్‌, రూ.12వేలకోట్లతో ముందుకొచ్చిన బీఆర్‌టీ గ్రూప్‌, రూ.24వేలకోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్న ఒంగోలు పేపర్‌మిల్స్‌, రూ.1400కోట్లతో ముందుకొచ్చిన ఏషియన్‌బ్యాంక్‌, రూ.2,400కోట్లు ఇస్తామన్న వరల్డ్‌ బ్యాంక్‌, కియా కంపెనీకి చెందిన 17 అనుబంధరంగ పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతుంటే జగన్మోహన్‌రెడ్డి చూస్తూ కూర్చున్నాడని అనురాధ మండి పడ్డారు. చంద్రబాబు కాలికి బలపం కట్టుకొని తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తే, జగన్మోహన్‌రెడ్డి గడపదాటకుండానే పరిశ్రమలన్నింటినీ పక్కరాష్ట్రాలకు తరలిపోయేలా చేశారన్నారు. ఒక్క అవకాశమంటూ ప్రజల్ని అడిగి, అధికారంలోకి వచ్చినవ్యక్తి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడన్నారు. 

అమరావతి స్టార్టప్‌ ప్రాజెక్ట్‌ నుంచి సింగపూర్‌సంస్థ వైదొలగకుండా ఉంటే, రాజధాని పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదన్నారు. రాజధాని భూములు సింగపూర్‌ సంస్థకు అమ్మేశారని దుష్ప్రచారం చేస్తున్న వైసీపీనేతలు, భూమిని పెట్టుబడిగా పెట్టి, రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానించిన విషయాన్ని తెలుసుకోవాలని అనురాధ హితవుపలికారు. సింగపూర్‌ ప్రభుత్వం అవినీతిలేకుండా పనిచేస్తుందని, అటువంటి ప్రభుత్వంలోనివారు చంద్రబాబుపై గౌరవంతో రాష్ట్రానికి వస్తే, ఆ దేశ సంస్థను వెళ్లగొట్టేవరకు వైసీపీ నిద్రపోలేదని ఆమె ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంతాన్ని శ్మశానంగా మార్చేసిన రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర యువతను గంజాయికి బానిసలను చేస్తోందన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఇంటిచుట్టూనే గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని, తనకొడుకు బిళ్లలరూపంలో ఉన్న మాదకద్రవ్యా లకు బానిసయ్యాడని, తనకు చావుతప్ప మరోగత్యంతరం లేదని ఒకతల్లి తనతో మొరపెట్టు కుందని అనురాధ తెలిపారు. 
ఆ తల్లి వేదన సోషల్‌మీడియాలో అందరూచూశారని, దానిపై ఓర్వలేని వైసీపీనేతలు తనపై వ్యక్తిగత ఆరోపణల చేస్తూ, బెదిరింపులకు పాల్పడ్డార ని పంచుమర్తి వాపోయారు.

 

తాడేపల్లిలో ఏమీలేనప్పుడు డీఎస్పీ, ఎస్పీలు హడావిడిగా ఎందుకు కార్బన్‌సెర్చ్‌ చేశారని, 12 కిలోల గంజాయిని ఎక్కడినుంచి స్వాధీనం చేసుకున్నారని ఆమె నిలదీశారు. తెలుగుదేశం వాళ్లే గంజాయి రాజకీయం చేశారని సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేసిన వైసీపీనేతలు పత్రికల్లో వచ్చిన కథనాలపై ఏం సమాధానం చెబుతారని అనురాధ ప్రశ్నించారు. రాజధాని ప్రాంత యువతను మాదకద్రవ్యాలకు బానిసల్నిచేసిన ప్రభుత్వం, పరిశ్రమల గురించి ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో చివరకు ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తోందన్నారు. వెనక్కు వెళ్లిన పెట్టుబడులను, పరిశ్రమల ను తిరిగి రప్పించడానికి రాష్ట్రప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో, ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుందో ప్రజలకు తెలియచేయాలని అనురాధ డిమాండ్‌చేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: