బిగ్ బాస్ లో వంద రోజులకు పైగా గడిపిన శ్రీముఖి రన్నర్ గానే నిలిచింది. ఈ సీజన్ విజేత ఆమె అని అంతా భావించారు అయితే శ్రీముఖి మాత్రం సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఇవన్నీ ఇలా ఉంటే తాను గెలిచినట్లుగా భావిస్తానంటూ సరదాగా హ్యాపీ ట్రిప్పులకు వెళ్ళిన శ్రీముఖి ఆ తరువాత మళ్ళీ తన  ప్రొఫెషన్ మీద ద్రుష్టి పెడుతోంది.

 

ఈ నేపధ్యంలో శ్రీముఖి మళ్ళీ పాత షోలలో కంటిన్యూ అవుతుందా లేక కొత్త షోలకు రెడీ అవుతుందా అన్నది పెద్ద సస్పెన్స్ గా ఉంది. అయితే ఇపుడే దాని మీద  కొంత అప్ డేట్స్ వస్తోంది. శ్రీముఖి ఇపుడు జబర్దస్త్ కామెడీ షోలో మెరవనుందని అంటున్నారు. ఈ షోకి పోటీగా మరో చానల్లో కొత్తగా షో స్టార్ట్ చేస్తున్న నేపధ్యంలో చాలా మంది ఇక్కడ నుంచి అక్కడికి జంప్ అవుతున్నారు.

 

ఇక హాట్ యాంకర్ అనసూయ కూడా వెళ్ళిపోతొందని అంటున్నారు. అదే జరిగితే అనసూయ ప్లేస్ లోకి శ్రీముఖి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. మరి శ్రీముఖి కనుక వస్తే జబర్దస్త్ షో ఒక్కలా ఉండదని, హై రేంజి టెంపరేచర్లోకి వెళ్ళిపోతుందని అపుడే అంటున్నారు. నిజానికి శ్రీముఖి ఇపుడు బిగ్ బాస్ లో తరువాత కనిపించే తొలి షో మీద మంచి అంచనాలు ఉన్నాయి. దాన్ని సొమ్ము చేసుకోవడానికి జబర్దస్త్ టీం శ్రీముఖిని సంప్రదించి ఒకే చేయించుకుందని అంటున్నారు. మరి చూడాలి శ్రీముఖి జబర్దస్ ఎలా అదిరిపోతుందో.

 

మరో వైపు జబర్దస్త్ పాత బ్యాచ్ తో కొత్త కామెడీ షో కూడా పోటీగా ఉంటుందిపుడు. దాంతో శ్రీముఖి ఏ విధంగా తన అప్పర్ హ్యాండ్ ని ప్రూవ్ చేసుకుంటుందన్నది కూడా బిగ్ టాస్క్ అంటున్నారు. ఏది ఏమైనా జబర్దస్త్ కి ఇపుడు శ్రీముఖి ఎసెట్ అవుతుందని మాత్రం అంతా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: