సునామీలు ఎపుడో కానీ రావు. రాజకీయాల్లో కూడా అద్భుత విజయాలు ఎపుడో కానీ రావు. అలా ఒక ఎన్టీయార్, ఒక జగన్ కనిపిస్తారు. అంతకు ముందు వెళ్తే  70 దశకంలో పీవీ నరసింహారావు కూడా ఉంటారు. వీరంతా జనం ఓట్లను గుత్తమొత్తంగా కొల్లగొట్టారు. మొత్తం ఓట్లలో యాభై శాతం పైగా రావడం అంటే తమాషా కాదు, ఇక  తొంబై శాతం సీట్లు తెచ్చుకోవడం ఆషామాషీ కానేకాదు. ఇది నిండు ప్రజాభిమానానికి నిదర్శనం. ఎవరు కాదన్నా కూడా  జగన్ రియల్ హీరో.

 

పైగా ప్రజలు ఏరీ కోరీ మెచ్చుకున్న ప్రజా నాయకుడు. అటువంటి జగన్ని ముఖ్యమంత్రిగారూ అని పిలవడానికి జనసేనాని ఎందుకో మొహమాటపడుతున్నాడా అనిపిస్తోంది. లేక ఆయన ఏమైనా అసూయ పడుతున్నాడా అన్నది మరో డౌట్. ఏది ఏమైనా జగన్ సీఎం గా ఎన్నికైన ఆరు నెలలు గడచినా కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు అన‌డంలేదు. వైసీపీ లీడర్ అంటున్నారు. జగన్ రెడ్డి అంటున్నారు. తన ట్విట్టర్ ద్వారా యుధ్ధం చేసినా, బయట మాట్లాడినా కూడా జగన్ని ఎందుకో సీఎంగా పవన్ అంగీకరించలేకపోతున్నారా అనిపించకమానదు.

 


ఇదే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు చంద్రబాబును గౌరవనీయ ముఖ్యమంత్రి గారూ అని ట్విట్టర్ ద్వారా సంభోదించారన్నది అదే ట్విట్టర్  చెబుతోంది. ఇక తాజాగా కేసీయార్ కి ఆర్టీసీ సమ్మె గురించి వివరించే ప్రయత్నంలో గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీయార్ గారూ అంటూ పవన్ ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. అంటే పొరుగున‌ ఉన్న సీఎంని గౌరవిస్తున్న పవన్ సొంత రాష్ట్రంలో జగన్ని మాత్రం ఎందుకు గౌరవించలేకపోతున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. ప్రజాస్వామ్యంలొ బ్యూటీ అదే. ప్రజాభిప్రాయాలను గౌరవించిన వారికి అదే ప్రజలు ఎపుడైనా పట్టం కడతారు. ఎందుకంటే ఇక్కడ ప్రభువులు వారు. 

 

మరి చంద్రబాబు అయినా పవన్ అయినా ప్రజా తీర్పులను కించపరచేలా వ్యవహరిస్తే అసలైన ప్రభువులకు కోపం వస్తుంది. అపుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరూ వూహించలేరుగా. ఏది ఏమైనా పవన్ తానుగా చెప్పుకున్నట్లుగా  రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ వ్యక్తిగత శ‌త్రువులుగా ఉండరాదు. మరి పవన్ ఆ విధంగా వ్యవహరించగలరా. సమస్య ఏదైనా ఉంటే ముందు ముఖ్యమంత్రితో చర్చించి అక్కడ కాదూ  అంటే అపుడు రోడ్డెక్కే విధంగా రాజకీయం చేయగలరా. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: