అన్నీ నేనే చేసా..అంతా నేనే చేశా.. రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చా.. ఇదీ తరచూ చంద్రబాబు చెప్పే మాటలు. అయితే ఆ మాటల్లోని డొల్ల తనాన్ని బయటపెట్టారు. వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చే సంపద అంతా కూడా రెవెన్యూ రూపంలోనే ఉంటుందన్నారు.

 

2014-15 ఓన్‌ ట్యాక్స్‌ రూ.42,618 కోట్లు, ఆ తరువాత ఏడాది 39 వేల కోట్లు, 2016లో 44 వేల కోట్లు, జీఎస్టీ వచ్చిన తరువాత 2017లో 49 వేల కోట్లు పెరిగిందన్నారు. చంద్రబాబు దిగిపోయేసమయంలో రూ.43 వేల పెండింగ్‌ బిల్లులు పెట్టారన్నారు. సివిల్‌ సప్లైయింగ్‌లో రూ.20 వేల కోట్లు అప్పులు చేశారన్నారు. ఎక్కడికి వెళ్లనా బకాయిలే ఉన్నాయన్నారు. సూదికి, దూదికి బిల్లులు పెండింగే పెట్టారన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అప్పు రెండున్నర లక్షల కోట్లకు చేరుకుందని లెక్కలు చెప్పారు బుగ్గన.

 

ఆశావర్కర్లు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా చంద్రబాబు దిగిపోయారన్నారు. మన అభివృద్ధి లక్ష్యాల్లో పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, చదువులు, ఆడవాళ్లకు, మగవాళ్లకు సమానత్వం, తాగునీరువంటి 17 లక్ష్యాలు ఉంటాయన్నారు. టాప్‌ ఐదు రాష్ట్రాల్లో ఒక్క అంశంలో మాత్రమే ఏపీ టాప్‌లో ఉందన్నారు. ఇక ఇసుక విషయాన్ని ప్రస్తావిస్తూ.. చింతమనేని అరాచకాలు అప్పుడే మరిచిపోయారా అని ప్రశ్నించారు.

 

నాడు పోలవరం నుంచి నీళ్లు తెస్తున్నామని, ఎక్కడ చూసినా పసుపు పచ్చ నీళ్లు చల్లారని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో పట్టిసీమ చేపట్టిన వాళ్లే ఇవాళ పోలవరాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ఇదే ఏజెన్సీకి 14 శాతం అదనంగా ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ పారదర్శకంగా రివర్స్‌ టెండరింగ్‌తో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు ప్రశంసించిన సంస్థకే పోలవరం పనులు అప్పగించామన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: