టీడీపీ అధినేత చంద్రబాబుకు యూటర్నులు కామన్ అయ్యాయి. విజయసాయిరెడ్డి ఏ సమయంలో చంద్రబాబుకు యూటర్న్ బాబు అని పేరు పెట్టారో కానీ దాన్ని ఆయన సార్థకం చేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు మరో యూటర్న్ తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకూ జగన్ సర్కారు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ మాట మార్చారు.

 

తాము ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించడం లేదని ప్రకటించారు. సరైన ప్రిపరేషన్ లేకుండా చేయొద్దనే తాము చెబుతున్నామని అంటున్నారు. ఎందుకిలా స్వరం మార్చారు అంటారా.. పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువులు వద్దా.. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటూ జగన్ సంధించిన అస్త్రాలు జనంలోకి బాగా వెళ్లాయట. జనం కూడా ఇంగ్లీష్ మీడియంను స్వాగతిస్తున్నారని తెలిసిందట.

 

ఇక అనవసరంగా ఈ ఇష్యూలో కెలుక్కోవడం కంటే.. మెల్లగా బయటపడటం బెటర్ అని చంద్రబాబు ఫీలవుతున్నట్టున్నారు. అందుకే ఆ పార్టీ నేతలు ఇప్పుడు స్వరం మారుస్తున్నారు. ఈ విషయాన్ని వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాగా ఎండగట్టారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.

 

1990 ముందర ఇంగ్లీష్‌ కాలేజీలు లేవా అని ప్రశ్నించారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ను ఇంగ్లీష్‌ మీడియం చేయడంతో ప్రతిపక్ష నాయకులకు కడుపు మండిందన్నారు. వారి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారని ప్రశ్నించారు. చంద్రబాబు తానే ఇంగ్లీష్‌ నేర్పించానని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబే అందరికి ఇంగ్లీష్‌ నేర్పించారని ఎద్దేవా చేశారు. లోకేష్‌, దేవినేని ఉమా, చింతమనేని, బుద్ద వెంకన్నలకు ఇంగ్లీష్‌ నేర్పించాలని సూచించారు.

 

రంగులు వేసేది నేర్పించింది మీరు కాదా చంద్రబాబు అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో బడికి, గుడికి పచ్చ రంగు వేసింది మీరు కాదా అన్నారు. రూ.10 వేలు ఎలక్ర్టానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసినా ఓట్లు వేయకుండా రూ. 1000 ఇచ్చిన వారికి ఓట్లు వేశారని చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎకానమిస్టు, విజనరీ అంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. నీరు- చెట్టు పేరుతో వేల కోట్ల కొల్లగొట్టారని, ఈ పనులపై విచారణ కొనసాగుతుందన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: