గచ్చిబౌలి .. హైదరాబాద్ లోనే ఇప్పుడు కాస్ట్లీ ఏరియా.. గజం లక్షల్లో ధర పలుకుతుంది. అలాంటి ప్రాంతంలో అపార్ట్ మెంట్ కొనాలంటే చదరపు అడుగుకు కనీసం ఆరు వేల రూపాయలు వెచ్చించాలి. ఈ ధర భూమితో కలిపి. మరి అలాంటిది ఇంకా ఏమీ అభివృద్ధి చెందని అమరావతిలో భూమి ఫ్రీ గా ఇస్తే చదరపు అడుగు ధర ఎంత ఉండొచ్చు. ఎంత ఉన్నా గచ్చిబౌళి కంటే తక్కువకే రావాలి కదా..

 

కానీ గతంలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో చదరపు అడుగుకు పదివేల రూపాయలు వెచ్చించి తాత్కాలిక నిర్మాణాలు కట్టించిన విషయాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ అరాచకాలను ఆయన మీడియా ముందు ఉంచారు. వీళ్లేమైనా స్వర్గంలో కడుతున్నారా అని ప్రశ్నించారు.

 

 

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాటలు ఎవరికి అర్దం కాకుండాఉన్నాయని, ఆయన ఏమి మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అమరావతి ప్రపంచ రాజధాని అయిపోయేదని చంద్రబాబు అంటున్నారని అదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. లక్ష కోట్ల తో నగరాలు వచ్చేస్తే ప్రపంచం అంతా ఎన్ని నగరాలు వచ్చేవని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరం 400 ఏళ్లనాటిది అని, దానిని తానే కట్టానని చంద్రబాబు చెబుతుంటారని బుగ్గన ఎద్దేవా చేశారు.

 

సింగపూర్ ప్రభుత్వానికి, ఎపి ప్రభుత్వానికి సంబంధం లేదని , కేవలం కొన్ని కంపెనీలు, ఏపితో ఒప్పందం చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు. తాత్కాలిక భవనాలకు అడుగుకు పదివేల రూపాయలు ఖర్చు చేశారని, హైదరాబాద్ లో భూమితో సహా ఆరువేల రూపాయల కు అపార్టెమెంట్ లభిస్తుంటే, అమరావతి ఉచిత భూమికి అడుగు కు పదివేల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. బంగారుగుడ్లు సంపాదించుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: