జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన నాగబాబు.. ఇప్పుడు అనేక విషయాలు బయటపెడుతున్నారు. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తన జబర్దస్త్ ప్రస్థానం ముగిసిందని అధికారికంగా వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా వివరణ ఇచ్చారు. తన రేంజ్ కు తగ్గ పారితోషకం ఇవ్వలేదన్నారు. అయితే.. రెమ్యునరేషన్ అనేది తనకు పెద్ద విషయమే కాదని నాగబాబు అన్నారు. తనకు మంచి రెమ్యునరేషనే ఇచ్చారని.. కానీ, అది తన స్థాయికి తగిన రెమ్యునరేషన్ కాదని తనకు తెలుసన్నారు. అయినప్పటికీ, అది తనకు పెద్ద ఇష్యూనే కాదన్నారు. కాబట్టి, తనకు తగిన రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం వల్ల మానేశాను అనేది తప్పు అని స్పష్టం చేశారు.

 

ఏడున్నరేళ్ల పాటు ఈ జర్నీ సాగడం ఒక రికార్డు. ‘జబర్దస్త్‌’ చేసే సమయానికి నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా. అప్పుడున్న పరిస్థితుల్లో ఈ షో నాకు చాలా సాయం చేసింది. ఇందుకు కారణం శ్యాంప్రసాద్‌గారే. కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. నవ్వించే వాళ్లంటే నాకు ఇష్టం. ప్రతి ఒక్కరూ అలాగే ఆలోచిస్తారు. అందుకే ‘జబర్దస్త్‌ ఒప్పుకొన్నా. నేను జబర్దస్త్‌ నుంచి బయటకు రావడానికి కారణం వ్యాపారానికి సంబంధించిన ఆలోచనా పరమైన విభేదాలు మాత్రమే.

 

రెమ్యునరేషన్‌ విషయంలో వివాదం వచ్చి బయటకు వచ్చానని అందరూ అనుకుంటున్నారు. కానీ, రెమ్యునరేషన్‌ అనేది నాకు పెద్ద విషయం కాదు. బయటకు అనుకుంటున్నవేవీ నిజం కాదు. ‘జబర్దస్త్‌’లో ఉండటానికి, ఇప్పుడు వెళ్లిపోవడానికి పారితోషికం అసలు ప్రామాణికం కానే కాదు. ఏదేమైనా ‘జబర్దస్త్‌’లో నా ప్రయాణం అద్భుతంగా సాగింది’’ అని చెప్పుకొచ్చారు.

 

నాగబాబు ‘జబర్దస్త్’ నుంచి బయటికి వెళ్లిపోవడం వెనుక అనేక కారణాలు వినిపించాయి. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పుకొచ్చారు. ‘జబర్దస్త్’ దర్శకులు నితిన్-భరత్‌లు బయటికి వచ్చేయడంతో నాగబాబు కూడా వాళ్లతో పాటే వచ్చేశారని కూడా టాక్ వినిపిస్తోంది. నాగబాబు అడిగినంత రెమ్యునరేషన్‌ను నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇవ్వననడంతో బయటికి వచ్చేశారనేది మరో పుకారు. ఈ పుకార్లకు నాగబాబు ఫుల్ స్టాప్ పెట్టినట్టైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: