తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఇక ముగిసినట్లే కాని మరో కొత్త సమస్య ఇప్పుడు కార్మికుల నెత్తిలో కూర్చుంది. అదేమంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ప్రకటించిన నిర్ణయం సంచలనంగా మారింది. అదేమంటే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆర్టీసీ నడపాలంటే నెలకు కనీసం రూ.640 కోట్లు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి? సంస్థకు ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. అని ఘాటుగా తేల్చారు కేసీయార్.

 

 

ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. ఇదే కనుక జరిగితే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని యథావిధిగా నడపడం సాధ్యం కాదు’ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇకపోతే ఈ రోజు 5,100 రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

 

 

ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు,ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.. అదీ కాకుండా ‘ఆర్టీసీకి ఇప్పటికే రూ.5వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పలు, బకాయిలు దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉన్నాయి.

 

 

ఉద్యోగులకు సెప్టెంబర్‌ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్లు కావాలి. సీసీఎస్‌ రూ.500 కోట్లు ఇవ్వాలి. డీజిల్‌ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉంది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పీఎఫ్‌ బకాయిల కింద నెలకు దాదాపు రూ.65–70 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది’ అందువల్ల ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీని యథావిధిగా నడపం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని ఆర్టీసీ కార్మికుల పరిస్దితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారు ఐయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: