ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు ఈ మధ్య మారుమ్రోగిపోతుంది. టీడీపీలో చాలా మంది నేతలు బయటికి వచ్చేసి చంద్రబాబు .. లోకేష్ మీద విమర్శలు గుప్పించి .. ఎన్టీఆర్ వస్తేనే ఆ పార్టీ బాగుపడుతుందని భహిరంగంగా చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ పార్టీలో చాలా మంది నేతలు ... లోకేష్ కు నాయకత్వ లక్షణాలు లేవని డిసైడ్ అయిపోయారు. టీడీపీలో కొత్త కథ మొదలయ్యేలా కనిపిస్తోంది. ఈ కొత్త కథ కూడా చంద్రబాబు వయసు మీద పడటం.. ఈ యేడాది ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడం... ధిక్కార స్వరాలు ఎక్కువ అవ్వడం వల్లే మొదలైంది. ఈ 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి 23 సీట్లు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఓడిపోయిన దగ్గర నుంచి అనేకమంది నేతలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. పార్టీ నుంచి కీలక నేతలు కూడా బయటకు వెళ్లిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు వయసు - నారా లోకేశ్ అసమర్ధత అని పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది.

 

ఇప్పటికే చంద్రబాబు వయసు మీద పడిపోవటం ఇంకెన్నాళ్లో రాజకీయాలు చేయలేనని బాబుకు కూడా తెలుసు. ప్రస్తుతం చంద్రబాబు వయసు 70 ఏళ్ళు మహా అయితే ఆయన మరో ఐదారేళ్లు మాత్రమే రాజకీయం చేయగలరు. అయితే ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే కుమారుడు లోకేశ్ ని నాయకుడుని చేయాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేశ్ కు పార్టీని నడిపించే సమర్ధత లేదని పార్టీలో చాలా మంది ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ టైంలోనే ఎన్టీఆర్ రాజకీయారంగ్రేటానికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి.

 

జూనియర్ ఎన్టీఆర్ తాను రాజకీయాల్లోకి రానని ఎప్పుడు చెప్పిందే లేదు. అంటే రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ కు మక్కువ ఉంది. 2024లో కూడా టీడీపీ పొత్తులతోనే ?  లేదా సొంతంగానో పోటీ చేస్తుంది. ఆ ఎన్నికలకు కూడా ఎన్టీఆర్ దూరంగానే ఉండే ఛాన్స్ ఉందనే ఎక్కువ మంది విశ్లేషకుల అంచనా. 2029 నాటికి ఎన్టీఆర్ వయసు 46 ఏళ్ళు అవుతుంది. అంటే కరెక్ట్ గా బాబు రిటైర్ అయ్యి...ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి దిగే సమయం. బాబు ఎన్టీఆర్ కు ఎలాగూ పార్టీ పగ్గాలు అప్పగించరు. అలా జరగని పక్షంలో 2029కు కాస్త ముందే ఎన్టీఆర్ సొంత పార్టీతో ఎంట్రీ ఇస్తే.. అప్పుడు టీడీపీ రెండుగా చీలిపోవడం ఖాయం. ఇప్పటికే ఎన్టీఆర్ ని పార్టీలోకి తీసుకురావాలని కార్యకర్తల్లో డిమాండ్ గట్టిగా వస్తుంది. ఇది 2024 ఎన్నికలకు ముందు మరింత ఎక్కువ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: