బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని అన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చే నేతలు బీజేపీలో చేరడానికి ప్రస్తుతం సరైన సమయం కాదని అవసరమైనపుడు టచ్ లో ఉన్న ఎంపీలను, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటామని సుజనా చౌదరి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీతో జత కలవాలని, సపోర్ట్ కావాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెంపర్లాడుతున్నారని సుజనా చౌదరి అన్నారు. 
 
ప్రస్తుతం వైసీపీ, టీడీపీ పార్టీలతో బీజేపీ పార్టీకి అవసరం లేదని సుజనా చౌదరి అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నన్నైతే కలవలేదని భారతీయ జనతా పార్టీ నేతలతో కలిసినట్లుగా నాకైతే సమాచారం లేదని సుజనా చౌదరి అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇద్దరూ టచ్ లో ఉన్నారని అందులో తప్పేముందని సుజనా ప్రశ్నించారు. బీజేపీ ఏపీలో అధికారం దిశగా అడుగులు వేస్తోందని సుజనా చౌదరి అన్నారు. 
 
సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను బట్టి ఏపీలో బీజేపీ పార్టీ పుంజుకోవడానికి తగిన ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. నిన్న ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో సుజనా చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి 9మంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీతో టచ్ లో ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి. సుజనాచౌదరి 20మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. వైసీపీ నుండి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారని చేసిన ప్రకటన వైసీపీ వర్గాల్లో కూడా తీవ్ర దుమారం రేపుతోందని తెలుస్తోంది. 
 
సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఉన్నది కేవలం 23 మంది ఎమ్మెల్యేలు. ఈ 23 మంది ఎమ్మెల్యేలలో వల్లభనేని వంశీ వైసీపీ పార్టీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరు బీజేపీ పార్టీలో చేరబోతున్నారో ఆ వివరాలు ఇప్పుడు అప్రస్తుతం అని సుజనా చౌదరి అన్నారు. సుజనా చౌదరి వ్యాఖ్యలు కేవలం మాటలకే పరిమితమవుతాయా...? లేదా...? అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: