ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రచ్చబండ కార్యక్రమం ప్రారంభించాలని ఆయన నిర్ణయించడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు అన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయాా లేదా అనే అంశాల పై ఆయన ప్రత్యక్షంగా ప్రజలతో చర్చించనున్నారు. అర్హులు ఎవరైనా ఉంటే వారికి వెంటనే ప్రభుత్వ పథకాలు అందేలా అక్కడి నుంచే ఆదేశించనున్నారు. ప్రతి వారంలో ఒక జిల్లాలో జగన్ రచ్చబండ నిర్వహించబోతున్నారు.

గతంలో చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన వైఎస్ ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. వాతావరణం అనుకూలించకపోవడంతో కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలో నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో వైఎస్ కన్నుమూశారు. దీంతో ఆ కార్యక్రమం అక్కడే అలాగే ఆగిపోయింది. దీంతో తన తండ్రి ప్రారంభించి అర్థంతరంగా ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని జగన్ పున: ప్రారంభించబోతున్నారు. సీఎం హోదాలో ఆయన రచ్చబండను నిర్వహించబోతున్నారు.

Image result for రచ్చబండ

అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయటం పైనే ఫోకస్ పెట్టామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టంగా తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్వులు..విభాగాధిపతులతో సీఎం సమావేశం కూడా అవ్వడం జరిగింది. ఆ సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని వివరించారు. గత ప్రభుత్వం రూ.40వేల కోట్ల బిల్లులను పెండింగులో పెట్టిందని చెప్పుకొచ్చారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై కొన్ని నెలలుగా దృష్టిపెట్టామని..అనవసర వ్యయాన్ని తగ్గించడానికి అధికారులు దృష్టిపెట్టాలని సూచించడం జరిగింది. ప్రభుత్వం తిరిగి ఎన్నిక కావడం అన్నదే ఒక మైలు రాయి..అంటూ జగన్ అసలు లక్ష్యాన్ని స్పష్టం చేసారు. ప్రజల ఆశలు.. ఆకాంక్షలను నెరవేర్చినప్పుడే ఇది జరుగుతుందని స్పష్టంగా తెలిపారు.

 

ఈ రచ్చబండ  కార్యక్రమం సందర్బంగా ప్రజలనుంచే వచ్చే వినతులపైన హామీలు ఇస్తామని..ఆ హామీలకు సంబంధించి కచ్చితంగా పనులు జరగాలని తెలియయచేయడం జరిగింది. మనం మాట ఇస్తే కచ్చితంగా చేయాలి.. ఎలాంటి తాత్సారం చేయకూడదన్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చినమాటను నెరవేర్చలేదన్న మాట రాకూడదని సీఎం తెలియయచేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: