ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని విజయవాడ నుండి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు 2014లో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లి చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ఆ తరువాత చంద్రబాబు, పవన్ వేరని విడిపోయామని చెబుతారని పేర్ని నాని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం విషయంలో యూ టర్న్ తీసుకున్నాడని పేర్ని నాని అన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ ఇంగ్లీష్ మీడియంపై రాద్ధాంతం చేసి అభాసుపాలైందని పేర్ని నాని అన్నారు. నేడు తప్పు చేశామని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారని నాడు మాత్రం బీజేపీ పార్టీతో తెగదింపులని అన్నారని పేర్ని నాని చెప్పారు. జుగుప్సాకరమైన రాజకీయం చంద్రబాబు రాజకీయమని పేర్ని నాని అన్నారు. పిల్లిని పులిగా చూపించే ప్రయత్నం గత ఐదేళ్లలో చంద్రబాబు చేశారని  అన్నారు. 
 
ప్రజలు వాస్తవాలను తెలుసుకున్నారని అందుకే తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పారని పేర్ని నాని అన్నారు. సుజనా చౌదరి బాబు భజన పార్టీ అని పేర్ని నాని అన్నారు. సుజనాచౌదరి గారి పిల్లలు ఎక్కడ చదువుకున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. తెలుగు భాషపై అంత మమకారం ఉంటే తమ పిల్లల్ని సుజనా చౌదరి తెలుగు మాధ్యమంలో ఎందుకు చదివించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. బ్యాంకుల్లో దొంగ ఆస్తులు పెట్టే అలవాట్లు పేదవాళ్లకు ఉండవని పేర్ని నాని అన్నారు. 
 
సుజనా చౌదరి రోజూ ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో ఒప్పందాలు చేసుకున్నారో సుజనా చౌదరి కాల్ డేట్ చూస్తే తెలుస్తుందని పేర్ని నాని అన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచన, నిర్ణయం తప్పు కాదని చంద్రబాబు ఒప్పుకున్నారని పేర్ని నాని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే అర్హత జగన్ దృష్టిలో పేదరికం మాత్రమే అని పేర్ని నాని అన్నారు. సీఎం జగన్ కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా పారదర్శకమైన పాలన అందిస్తున్నారని పేర్ని నాని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: