26 డిమాండ్లతో ఆర్టీసీ సమ్మె మొదలు... ఒక్క డిమాండ్ విషయంలో కూడా వెనక్కి తగ్గని బెట్టు... ఎన్ని బెదిరింపులు అయినా వెనుకడుగు వేయని పట్టుదల... ఎంతో మంది కార్మికుల మనోవేదన... ఇంకెంతో మంది ఆర్టీసీ కార్మికుల బలిదానాల తో కుటుంబాల ఆర్తనాదాలు... అయినా  వెనక్కి తగ్గని ఆర్టీసీ జేఏసీ పోరాటం...  తప్పకుండా ఆర్టీసీ కార్మికుల 26 డిమాండ్లను పరిష్కరించి తీరుతామనే  నినాదం. కానీ చివరికి  నినాదం మూగబోయింది... పోరాటం చిన్నబోయింది...కేవలం విజ్ఞప్తులు మాత్రమే మిగిలాయి. అటు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుదమని ఆలోచన వచ్చినప్పటికీ... ఆలోచనలన్నింటినీ చెల్లా చెదురు చేస్తూ తమ మాటలతో ఆర్టీసీ కార్మికుల్లో  నమ్మకాన్ని కలిగించి ముందుకు సాగిన వైనం. కానీ చివరికి ఏమైంది. 26 డిమాండ్లలో ఒక్క డిమాండ్ తగ్గిన ఊరుకునేది లేదు అని చెప్పిన అదే ఆర్టీసీ జేఏసీ... ఒక్క డిమాండ్  నెరవేర్చుకున్న పర్లేదు ఆర్టీసీ కార్మికులను  విధుల్లో చేర్చుకోండి చాలు అనే స్థితికి వచ్చేస్తుంది. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకోండి తాము సమ్మె విరమిస్తాం  అని  మాట మార్చేసింది ఆర్టీసీ జేఏసీ . దీని కోసమేనా ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలుపెట్టింది. హాయిగా విధులు ఉద్యోగాలు చేసుకుంటూ   కుటుంబంతో ఆనందంగా ఉన్న కార్మికులను డిమాండ్లు పరిష్కరించుకుందాం అంటూ సమ్మెలోకి దింపి ... ఎంతో మంది కార్మికుల ఆత్మబలిదానాలు...ఎన్నో ఇబ్బందుల తర్వాత... ఇప్పుడు ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించకుండా సమ్మె విరమిన...దేనికోసమా  ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నది . 

 


 ఓవైపు జీతాలు లేక కుటుంబ పోషణ భారం పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక మనస్తాపం చెందుతున్న కార్మికులు  ఆర్టీసీ జేఏసీ డిమాండ్ల పరిష్కారం అనే మాటను నమ్మి ముందుకు వస్తే ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ  కార్మికులను  నట్టేట ముంచింది. బెట్టు వీడి  మెట్టు దిగి విధుల్లో చేరండి  అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ... ఆర్టీసీ కార్మికులను ముందుండి నడిపిస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం  పట్టు విడువలేదు. మాకు హైకోర్టులో న్యాయం జరుగుతుంది అంటూ హై కోర్టు మెట్లెక్కింది ఆర్టీసీ జేఏసీ. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కార్మికుల హెచ్చరిస్తూనే ఉంది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ మినహా మిగతా డిమాండ్లపై చర్చిద్దాం అంటుంది. కానీ ఆర్టీసీ జేఏసీ మాత్రం ఒక్క డిమాండ్ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు  అన్నట్లుగా చర్చలను అర్ధాంతరంగా ముగించింది . కాని చివరికి అసలు ఒక్క డిమాండ్ కూడా నెరవేరకుండానే సమ్మె విరమిద్దాం అంటూ  ప్రకటన చేసింది. 

 


 హైకోర్టుకు వెళ్లినప్పటికీ అక్కడ ఆర్టీసీ జేఏసీ నాయకులకు షాక్ తగిలింది. తాజాగా ఆర్టీసీ ప్రైవేటీకరణ పై కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ తీర్పును వెలువరించింది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు భవితవ్యమేమిటో ప్రశ్నార్థకంగా మారిపోతోంది. కనీసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి    తీసుకుంటారా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఇప్పుడు డిమాండ్లు నెరవేరడం కాదు కదా ఉన్న ఉద్యోగాలు ఊడే  పరిస్థితి వచ్చేసింది. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మె తో ఎవరికి నష్టం  ముఖ్యమంత్రి కెసిఆర్ కా... అశ్వద్ధామ రెడ్డికా ... కేవలం నష్టం జరిగింది సామాన్య ప్రజలకు కార్మికులకు. అటు బస్సులు తిరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నది సామాన్య ప్రజలు... మరోవైపు జీతాలు లేక ఉద్యోగాలు కూడా ఉంటాయో ఉడతాయో  తెలియని పరిస్థితి ఏర్పడింది   ఆర్టీసీ కార్మికులకు. 50 రోజుల కార్మికులు సమ్మెలో చివరికి నెగ్గింది  ప్రభుత్వం పంతమే .

మరింత సమాచారం తెలుసుకోండి: