సినిమాల్లో మనకు కనిపించే మిస్టరీ.. అప్పుడప్పుడు బయటకనిపించే విషయాలకు దగ్గరగా ఉంటుంది.  బయటకనిపించే విషయాలను ఆధారంగా చేసుకొని సినిమాలు తీస్తుంటారు.  అలా తీసే సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి.  వాటిలో ఒకటి ఇది.  ఇది చూడటానికి ఓ స్పూఫ్ గా అనిపించినా.. రియల్ గా చూసుకుంటే ఇది  స్పూఫ్ కాదు.  రియల్ గా జరిగిన అంశమే.  
లాస్ ఏంజిల్స్ లోని సెసిల్ హోటల్.. ఆ హోటల్ లో ఎలిసా లామ్ అనే యువతి రూమ్ తీసుకొని ఉంటుంది.  అయితే, రూమ్ లో ఉండే ఆ యువతి సడెన్ గా కనిపించడం మానేసింది.  ఏమైందో ఎక్కడికి వెళ్లిందో తెలియదు.  తల్లిదండ్రులు కూడా ఆమె కోసం ఎంక్వయిరీ చేశారు. ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియలేదు. నాలుగు రోజుల తరువాత పైన వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే నీళ్లు వాసన వస్తున్నాయి.  
పైగా ఫ్లో తక్కువుగా ఉండటంతో అనుమానంతో సిబ్బంది పైన ఉన్న వాటర్ ట్యాంక్ మూట ఓపెన్ చేసి అందులో ఎలీసా విగతజీవిత పడి ఉన్నది.  ఆమె వాటర్ ట్యాంక్ లోకి ఎలా ఎక్కి దూకిందో తెలియదు.  వాటర్ ట్యాంక్ ను ఓపెన్ చేస్తే అలారం మోగుతుంది.  అందరిని అలర్ట్ చేస్తుంది.  సిబ్బంది మాత్రమే ఆ వాటర్ ట్యాంక్ ను ఓపెన్ చేస్తారు.  మిగతావాళ్ళు ఎవరు ఓపెన్ చేసినా అలారం మోగుతుంది.  
ఎలిసా ఆ వాటర్ ట్యాంక్ లో పడింది అని చెప్పుకుంటున్న సమయంలో అలారం మోగలేదు.  అంతేకాదు, ఎలిసా చివరిసారిగా లిఫ్ట్ దగ్గర కనిపించింది.  లిఫ్ట్ లో వింత వింతగా ప్రవర్తించింది.  లిఫ్ట్ లో ఎలిసా ఉన్నంతసేపు లిఫ్ట్ ఓపెన్ చేసే ఉన్నది.  ఎవరితోనో మాట్లాడింది.  దోషేణ చేసింది.  కానీ, అవతల ఉన్న వ్యక్తి ఎవరో తెలియలేదు.  హోటల్ లో దెయ్యాలు ఉన్నాయని ప్రచర్మంజరిగింది .  అప్పుడెప్పుడో ఓ నటి కూడా ఇలానే మరణించింది . ఎలీసా మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అన్నది ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: