దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల పై బిజెపి ఎప్పటినుంచో పట్టుసాధించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే దేశంలోని ఎక్కువ  శాతం రాష్ట్రాలలో బిజెపి  జెండా ఎగుర వేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో వరుసగా విజయం సాధిస్తుంది బిజెపి.కానీ దక్షిణ భారతదేశంలో మాత్రం బీజేపీ తన హవా నడిపించలేకపోయింది.  నరేంద్ర మోడీ అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ ఒక కర్ణాటక రాష్ట్రం మినహా ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ అంతగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో  సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది బిజెపి అధిష్టానం. ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాలలో కమలం పార్టీ జెండా ఎగురవేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా కనిపిస్తుంది. అయితే ఆయా రాష్ట్రాలలో ప్రధాన పార్టీ నేతలను  ఆకర్షించడం పై దృష్టి పెట్టింది  బిజెపి . అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి ఆకర్షించిన విషయం తెలిసిందే అంతేకాకుండా... కొంతమంది ఇతర నేతలను కూడా బిజెపిలో చేర్చుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో  వైసిపికి గట్టిపోటీ ఇచ్చేందుకు బీజేపీ కొంచెం కొంచెంగా బలం చేకూర్చుకునే పనిలో పడింది. అయితే తెలంగాణలో కూడా ఇదే ఫార్ములాను పాటిస్తున్నట్లు కనిపిస్తుంది బీజేపీ అధిష్టానం. 

 


 తెలంగాణ లు రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారాన్ని దక్కించుకోవడానికి తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే వివేక్, సోమారపు సత్యనారాయణ వంటి కీలక నేతలు బిజెపిలో ఆహ్వానించి  కండవ కప్పుకునేలా చేసింది బీజేపీ. తెలంగాణలోని కీలక పార్టీ నేతలపై మరింత ఫోకస్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు అందరూ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రోజురోజుకు బిజెపిని బలపర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లలో  బిజెపి తెలంగాణలో బలపడుతుంది అనడానికి ఒక నిదర్శనమని చెప్పవచ్చు. అయితే తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మంచిర్యాల జిల్లాలో బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 

 


 ఈ సందర్భంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కాలేశ్వరం పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ పబ్బం గడుపుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్. టిఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని... ఆర్టీసీ నిర్వీర్యం చేసినట్లు సింగరేణి కూడా నిర్వీర్యం చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ  లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో త్వరలో బీజేపీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతుంది అంటూ లక్ష్మణ్ వ్యాఖ్యానించడం తెలంగాణ రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారింది . బిజెపి ప్రయోగించనున్న బ్రహ్మాస్త్రం  దెబ్బకు టిఆర్ఎస్ లోని  బాహుబలిలు,  కట్టప్ప లు  కొట్టుకుపోవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేసేందుకు  ఎన్నో  రోజులనుండి కేంద్రం కసరత్తు చేస్తున్న క్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: