2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ 151 ఎమ్మెల్యే సీట్లతో ఘన విజయం సాధిస్తే తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయం పాలయిన తరువాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి రాష్ట్రంలో రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. తెలుగుదేశం పార్టీ ఉనికిని నిలుపుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా టీడీపీ పార్టీకి ప్రజల నుండి సరైన స్పందన వ్యక్తం కావటం లేదు. 
 
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, కొందరు నేతలు మాత్రం జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు స్వీకరిస్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం జూనియర్ ఎన్టీయార్ ను పార్టీలోకి తీసుకొనిరావటానికి ఇష్టపడటం లేదు. మరి ఇప్పటికిప్పుడు జూనియర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే టీడీపీ పార్టీ భవిష్యత్తు మారిపోతుందా...? అనే ప్రశ్నకు ఇప్పటికిప్పుడు మారకపోయినా భవిష్యత్తులో మాత్రం తెలుగుదేశం పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. 
 
నిజానికి సీనియర్ ఎన్టీయార్ తరువాత ఏ సినిమా నటుడిని రాజకీయాల్లో ప్రజలు అంతగా ఆదరించలేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అంతగా సక్సెస్ కాకపోవటానికి  చిరంజీవి, పవన్ కళ్యాణ్ కొత్త పార్టీలతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టటం, ఈ కొత్త పార్టీలకు బలమైన కార్యకర్తల, నాయకుల కొరత, బూత్ లెవెల్ స్థాయి నుండి ఈ పార్టీలు బలోపేతం కాకపోవడం, పార్టీ విధివిధానాల గురించి ప్రజలకు అంతగా అవగాహన లేకపోవటం మొదలైన కారణాలు ఉన్నాయి. 
 
కానీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలా కాదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తే ప్రత్యామ్నాయంగా ప్రజల దృష్టి తెలుగుదేశం పార్టీపైనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీయార్ నాయకత్వం వహిస్తే తెలుగుదేశం పార్టీకి జూనియర్ ప్లస్ అవుతాడు తప్ప మైనస్ మాత్రం కాడు. 2024 ఎన్నికల లోపు జనసేన పార్టీ రాష్టంలో బలపడితే జనసేన పార్టీ కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఎమ్మెల్యే సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: