ముఖ్యమంత్రి జగన్ పాలన సరిగ్గా ఆరునెలలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఎన్నికల హామీలను  ఒక్కొక్కటిగా తీరుస్తూ పాలనను పరుగులు పెట్టించిన జగన్ ఇకపైన తన పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించాలనుకుంటున్నారు. ముందుగా జనంలోకి వెళ్ళి పార్టీ  మీద, ప్రభుత్వం మీద వారి అభిప్రాయలను కూడా తెలుసుకోవాలనుకుంటున్నారుట. రచ్చబండ పేరిట కార్యక్రమాన్ని కూడా జనవరి నెలాఖరు  నుంచే మొదలుపెట్టాలని భావిస్తున్నారుట.

 

ఈ నేపధ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత స్థానికి ఎన్నికల నగరా మోగుతుందని చెబుతున్నారు. ముందుగా పంచాయతీలకు, మండలాల‌కు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు పెట్టి ఆ తరువాత మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ఏం చేస్తారో తెలియదు మొత్తం జిల్లా పరిషత్తులన్నీ వైసీపీ ఖాతాలో పడాల్సిందేనని జగన్ మంత్రులకు పక్కాగా చెప్పేశారట.

 

ఏ ప్రభుత్వం చేయని విధంగా మనం ఆరు నెలల కాలంలోనే అన్ని రకాల హామీలను నెరవేర్చామని జగన్ చెప్పారని సమాచారం. అందువల్ల వాటి ఫలితాలు కూడా ప్రజల నుంచి రావాల్సి ఉందని ఆయన అంటున్నారుట.  లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం కచ్చితంగా వైసీపీ వైపే ఉండాలని జగన్ అంటున్న‌ట్లుగా భోగట్టా. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన బంపర్ విక్టరీ రిపీట్ కావాల్సిందేనని జగన్ క్లారిటీగా మంత్రులకు చెప్పేశారట.

 

ఒకవేళ అలా కనుక జరగకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని జగన్ హెచ్చరించారని టాక్. ఈ విషయంలో తాను తన తండ్రి వైఎస్సార్ ఫార్ములాను అమలు చేస్తానని జగన్ అంటూడడంతో మంత్రులకు షాక్ తగిలిందని చెబుతున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కర్నూల్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దాంతో ఆయా జిల్లాలలో  మంత్రులుగా ఉన్న మారెప్పను, మాగుంట బాబుని వైఎస్సార్ తప్పించారు.

 

ఇపుడు కూడా అలాగే చేస్తానని జగన్ అంటున్నారని భోగట్టా. దానికి తోడు మంత్రుల పని తీరు పట్ల కూడా జగన్ పూర్తి సంత్రుప్తిగా లేరని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో మంత్రులు కనుక తమ సత్తా చూపించకపోతే మాత్రం వారి మంత్రి సీటు ఎగిరిపోవడం ఖాయంగా  కనిపిస్తోంది. అంటే సంక్రాంతి పెద్ద పండుగ తరువాత లోకల్ బాడీ ఎన్నికలు, ఆ తరువాత మంత్రులకు షాకులు ఉంటాయన్న మాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: