జగన్ మీద తెలుగుదేశం పార్టీనే ఫిర్యాదు చేసింది. కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సీబీఐ విచారణను మొదలుపెట్టించింది. అప్పట్లో కాంగ్రెస్ వాళ్లు, తెలుగుదేశం పార్టీ వాళ్లు జాయింటుగా చేసిన ఫిర్యాదుతోనే కదా.. వైఎస్ జగన్ మీద సీబీఐ విచారణ మొదలైనది? మరి తెలుగుదేశం పార్టీ వాళ్లు గజినీలుగా మారిపోయారో, లేక జగన్ మీద సీబీఐ విచారణ కొనసాగుతూ ఉన్న విషయమే గుర్తుకు లేదో కానీ, మళ్లీ జగన్ మీద ఫిర్యాదు చేశారట.

 

 

    ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన టోల్ ఫ్రీ నంబర్ కు ప్రభుత్వాధికారులు కానీ, ప్రభుత్వంలోని వ్యక్తులు కానీ లంచం అడిగినా, ఇతర అవినీతిపై అయినా నంబర్ కు డయల్ చేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం రోజున ఇందుకు సంబంధించి నంబర్ ను ప్రారంభించారు.

 

 

     ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ తరఫున కామెడీ కితకితలు పెట్టారు వర్ల రామయ్య. ఆ నంబర్ కు ఫోన్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఆయన ఫిర్యాదు చేశారట. జగన్ పై చర్యలు తీసుకోవాలని కోరారట, తెలుగుదేశం పార్టీలో ఈ కామెడీలు చేయడమే వర్లరామయ్య పనైపోయినట్టుగా ఉంది. మొన్నటి వరకూ ఇదే జగన్ ప్రభుత్వం లో ఆర్టీసీ చైర్మన్ పదవిని పట్టుకుని ఈయన వేలాడారు. అప్పుడంతా మారుమాట్లాడలేదు. చివరకు తొలగించినంత పని చేశాకా కానీ ఈయన రాజీనామా చేయలేదు. ఇంతలోనే ఇప్పుడు ఇలాంటి కామెడీలు చేస్తూ ఉన్నారు. 

 

 

      సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన వ్యవహారం గురించి ఇప్పుడు మళ్లీ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడాన్ని కామెడీ గాక మరేం అనాలో తెలుగుదేశం పార్టీ వాళ్లకే తెలియాలి. ఇలాంటి కామెడీలు చేసే ఇరవై మూడు సీట్లకు వచ్చారు. జగన్ మీద తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదులు, సీబీఐ ఎంక్వైరీల తర్వాతే ఆయనను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్లు మరిచియినట్టుగా వున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: