హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా మీరు చూసే ఉంటారు. ఐశ్వర్యారాయ్, అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ లు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో మొదట ఐశ్వర్య, సల్మాన్ ఖాన్ లు ప్రేమించుకుంటారు. కానీ ఐశ్వర్య వివాహం సల్మాన్ తో కాకుండా అజయ్ తో ఐశ్వర్య తండ్రి జరిపిస్తాడు. పెళ్ళైన తర్వాత ఐశ్వర్య పాత ప్రియుడు సల్మాన్ గురించి తెలుసుకున్న అజయ్, ఐశ్వర్యను సల్మాన్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తన సంతోషాన్ని కోరుకుంటున్న భర్త ప్రేమను అర్థం చేసుకొని సల్మాన్ తో పెళ్ళికి ఒప్పుకోకుండా తన భర్త అజయ్ తోనే  ఉండి పోతుంది ఐశ్వర్య.

 

ఇదంతా సినిమా స్టోరీ. ఈ సినిమా 1999 లో విడుదలై అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కన్యాదానం తెలుగు సినిమా కూడా దాదాపు ఇదే స్టోరీని రిపీట్ చేస్తుంది. రచన-శ్రీకాంత్ లకు పెళ్ళైతే, శ్రీకాంత్ రచనను ఆమె ప్రేమించిన ఉపేంద్రకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఎందుకంటే సరిగ్గా ఇలాంటి కథే నిజ జీవితం లో జరిగింది కాబట్టి.

 

ఫ్యాషన్ డిజైనర్ సంగీత కి ఏడేళ్ల క్రితం భోపాల్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మహేష్ తో  వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇప్పుడు వీళ్ళు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. విడాకులు ఎందుకో తెలుసా, మహేష్ తన భార్య ప్రేమించిన వ్యక్తి తో ఆమె వివాహం చేయాలనీ అనుకోవడమే దీనికి అసలైన కారణం. సంగీత పెళ్ళికి ముందు ఒక వ్యక్తిని ప్రేమించింది కానీ సంగీత తండ్రి ఆమెను మహేష్ కు ఇచ్చి పెళ్లి చేసాడు.  ఇప్పుడు సంగీత కి  తన పూర్వ ప్రేమికుడు ఇప్పటికి పెళ్లి చేసుకులేదని తెలిసింది.

 

ఈ విషయం తెలుసుకున్న సంగీత .. తన భర్తకు విడాకులిచ్చి.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది. దీనికి భర్త మహేష్ మొదట ఒప్పుకోకపోయినా .. తర్వాత భార్య సంతోషం కోసం ఒప్పుకున్నాడు. కానీ ఇద్దరు పిల్లల సంరక్షణ తానే చూసుకుంటానన్నాడు. దీనికి సంగీత అంగీకరించింది. ప్రస్తుతం ఈ కేసు కోర్ట్ విచారణలో ఉంది. అయితే ఇరువురి అంగీకారం ఉన్నందున కోర్టు వీరికి విడాకులు మంజూరు చేస్తుందని వారి తరపు న్యాయవాది తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: