ఒక వ‌య‌సు వ‌చ్చాక పెద్ద‌వాళ్ళ‌ని ప‌ట్టించుకునేవారు ఈ రోజుల్లో ఎవ్వ‌రూ ఉండ‌డం లేదు. పిల్ల‌లు పెద్ద‌వాళ్ళైతే ఎవ‌రిదారి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక పెద్ద‌వాళ్ళ‌ను ప‌ట్టించుకునే నాధులే క‌రువ‌య్యారు. ఇలాంటి స‌మ‌యాల్లో చాలా ఒక వ‌య‌సు వ‌చ్చాక చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఒంట‌రిగా ఉండే స‌మ‌యాల్లో మ‌నం ఎవ‌రిన‌న్నా సంప్ర‌దించాలంటే మ‌న‌కు ద‌గ్గ‌ర‌లో ఫోన్  లేదా పిల‌వ‌గానే ప‌లికే ఒక మ‌నిషైనా మ‌న‌తోపాటు ఉండాలి. ఇటీవ‌లె ఓ వృద్ధురాలు ఇలాగే డోర్ లాక్ ప‌డిపోయి ఇరుక్కుపోయింది. అది ఎక్క‌డా అనుకుంటున్నారా...ఎక్క‌డో కాదండి స్నానం చెయ్య‌డానికని బాత్‌రూమ్‌లోకి వెళ్ళిన ఆమె బాత్ ట‌బ్‌లోనే బందీ అయ్యింది. కానీ, బయటకు రాలేకపోయింది. కారణం.. వృద్ధాప్యం.

 

ఇంగ్లాండ్‌లోని లౌబరౌ‌లో ఒంటరిగా నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలు స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్ళింది. బాత్ టబ్‌లో కూర్చున్న తర్వాత మళ్లీ పైకి లేవలేకపోయింది. శరీరం సహకరించకపోవడంతో ఆమె అందులోనే బందీ అయ్యింది. ఆమె బాగోగులు చూసేందుకు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సాయం కోసం కేకలు పెట్టలేపోయింది. అలా ఎనిమిది రోజులు ఆహారం లేకుండా బాత్ టబ్‌లోనే ఉండిపోయింది. కేవలం పైపు నుంచి వచ్చే నీటిని మాత్రమే తాగుతూ ప్రాణాలను దక్కించుకుంది.

 

విల్ట్‌షైర్ ఫామ్ ఫుడ్స్ నుంచి ఆమెకు రోజు ఆహారం అందుతూ ఉంటుంది. ఆమె ఫోన్ ద్వారా తనకు కావాల్సిన వస్తువులు, ఆహారాన్ని ఆర్డర్ చేస్తే వాళ్లే ఇంటికి వచ్చి ఇస్తుంటారు. అయితే, గత కొద్ది రోజులుగా ఆమె ఆహారం ఆర్డర్ చేయడం లేదు. ఆ సంస్థ నుంచి వారానికి ఒకసారి ఆమె ఇంటి వద్దకు వచ్చే ‘వీల్స్ ఆన్ సర్వీస్’ సిబ్బంది ఓ రోజు ఆమె ఇంటి కాలింగ్ బెల్ కొట్టారు. కానీ, ఆమె స్పందించక‌పోవ‌డంతో అనుమానంతో తలుపులు లోపలి నుంచి వేసి ఉండటంతో ఇంటి చుట్టూ తిరుగుతూ ఆమెను పిలవసాగాడు. దీంతో ఆమె స్పందించి.. తాను బాత్ టబ్‌లో చిక్కుకున్నానని, లేవలేని స్థితిలో ఉన్నానని తెలిపింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తలుపులు బద్దలకొట్టి ఆమెను రక్షించారు. ఆహారం లేకపోవడం వల్ల ఆమె బాగా నీరసించి పోయింది. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. ఇప్పుడు ఆమె కోలుకుంటోంది’’ ఆ ఫుడ్ డెలవరీ సంస్థ చొరవ చూపి ఉండకపోతే ఆమె పరిస్థితి మరింత దయనీయంగా మారేది. దీన్ని బ‌ట్టి ఒక వ‌య‌సు వ‌చ్చాక మ‌న‌తో పాటు ఎవ‌ర‌న్నా ఒక మ‌నిషి ఉండ‌టం చాలా మంచిది. అదే విధంగా ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు త‌లుపులు లాక్ అవ్వ‌కుండా జాగ్ర‌త్త‌ను వ‌హించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: