గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ పార్టీని వీడి ఆ పార్టీ అధినేతను చంద్రబాబు నాయుడు .. అతని కొడుకును లోకేష్ ను ఓ రేంజ్ లో విరామర్సించి టాక్ అఫ్ ది టౌన్ అయ్యాడు. అయితే వంశీ ఇంత వరకు రాజీనామా మాత్రం చేయలేదు. కానీ వైసీపీ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి ఖచ్చితంగా రావాలని జగన్ చెప్పిన షరతు ఉండనే ఉంది. అయితే ఇది వరకూ ఒకసారి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.ఆ సమావేశం అనంతరం ఆయన తను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.

 

కానీ స్పీకర్ ఫార్మాట్ లో మాత్రం వంశీ రాజీనామా చేసిన పరిస్థితి లేదు. అలాగని ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. తను తెలుగుదేశానికి మాత్రమే రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించారు. ఆ తర్వాతి పరిణామాల్లో ఆయన తెలుగుదేశం పార్టీని తీవ్రంగా దూషించారు. తెలుగుదేశం నేత రాజేంద్రప్రసాద్ ను టీవీ చర్చా కార్యక్రమంలో తీవ్రంగా తిట్టారు వంశీ. టీడీపీ నేత ఎమ్మెల్సీ లోకేష్  ను లక్ష్యంగా చేసుకుని కూడా వల్లభనేని విరుచుకుపడ్డారు. తనకు పార్టీలో పొగబెట్టారని వంశీ అన్నారు. అనంతరం ఆయన కామ్ అయ్యారు. అయితే తాజాగా ఆయన మరోసారి సీఎంను కలిశారు. ఇది వరకూ వంశీని జగన్ వద్దకు తీసుకెళ్లిన కొడాలి నాని ఈ సారి కూడా ఆయన వెంట ఉన్నారు. తమ పార్టీలోకి  చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా తప్పనిసరి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు.



అయితే ఉప ఎన్నికల్లో వల్లభనేని వంశీకి పార్టీ టిక్కెట్ దక్కుతుందా అంటే సమాధానం లేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అప్పుడు టికెట్ విషయంలో కూడా జగన్ ఎవరికీ భరోసా ఇవ్వడం లేదట. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా తన లెక్కల ప్రకారమే ఉన్నట్టుగా తెలుస్తోంది. తన పార్టీలోకి చేరితే తను చెప్పిన వారిని గెలిపించాల్సిందే అని జగన్ అంటున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ మోహన్ మరోసారి వెళ్లి సీఎంతో సమావేశం అయ్యారు. ఈ సారి కూడా ఆయన స్నేహితుడు కొడాలి నాని వెంట ఉన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: