చంద్రబాబునాయుడు యూ టర్నుల పర్వం విజయవంతంగా కొనసాగుతోంది. బాబు ఏది చెప్పినా అప్పటికి అది కరెక్ట్. ఆ తరువాత మాత్రం దాని సంగతే మరచిపోతారు. అన్నింటికీ మించి బాబు తాను ఏది చేసినా ప్రజల కోసమేనని అంటారు. ఆ విధంగా సులువుగా తప్పించుకుంటారు. మోడీతో నాకు వైరమేంటని బాబు తాజాగా అంటున్నారు. నాకు అయనకు వ్యకిగతమైన శత్రుత్వం ఉందా. ఆయన్ని నేనెందుకు తిట్టాలి. ఇదీ బాబు తాజాగా చెబుతున్న కధ.

 

మరి అంతలా మోడీతో గొడవలు లేవని బాబు చెప్పడం వెనక అసలు విషయం అందరికీ తెలిసిందే. మోడీతో బాబు మళ్ళీ కొత్త బంధాన్ని వేసుకోవాలనుకుంటున్నారు. అందుకోసం ఆయన మోడీకి జై అంటున్నారు. మోడీ ఏం చేసినా రైట్ అంటున్నారు. ఉద్ధవ్ ధాక్రే ప్రమాణానికి విపక్షం మొత్తం వెళ్ళినా బాబు మాత్రం అలా వెనక్కే ఉండిపోవడానికి కూడా మోడీని కలవాలనుకోవడమే ప్రధాన  కారణం.

 

ఇదిలా ఉండగా మోడీని బాబు ఇపుడు అర్జంటుగా కలవాలని అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే అమరావతి రాజధాని కోసమట. అమరావతి రాజధానిలో పర్యటించిన బాబు ఇపుడు దాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోవాలనుకుంటున్నారు.  అందుకోసం ఆయన మోడీ అపాయింట్మెంట్ కోరుతున్నారు. అయితే మోడీ అపాయింట్మెంట్  బాబుకు దక్కుతుందా అన్నది ఇపుడు చర్చ

 

మోడీ కనుక కరుణించి బాబుకు అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం అది ఏపీ రాజకీయాల్లో కీలకమైన అంశమే అవుతుందని అంటున్నారు. మోడీకి ఇప్పటికే మెచ్చుకుంటూ లేఖలు రాస్తూ బాబు ప్రసన్నం చేసుకుంటున్నారు. ఢిల్లీలో ఆయన పార్టీ నాయకులతో పాటు, బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నేతలు, తాజా బీజేపీ ఎంపీలు కూడా అమిత్ షాకు ఇప్పటికే దగ్గరయ్యారు. మరో వైపు వైసీపీకి, బీజేపీకి బాగా ఎడం చేయగలిగారు. ఈ టైంలో మోడీ అపాయింట్మెంట్ బాబుకు ఇవ్వవచ్చునని కూడా ఢిల్లీ వర్గాల సమాచారం. మూడు దశాబ్దాల శివసేన బంధం తెగిపోయింది. అందువల్ల బాబు వంటి సీనియర్ నేతతో దోస్తీకి బీజేపీ ఇపుడు సై అనవచ్చునని అంటున్నారు. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: