డాక్టర్ ప్రియాంక రెడ్డి.. నిన్నటి నుండి ట్రెండ్ అవుతున్న సంఘటన. గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ ప్రియాంక రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి చెటాన్‌పల్లి బైపాస్‌ రోడ్డు అండర్‌ బ్రిడ్జి కింద పెట్రోలు పోసి దహనం చేశారు. నిన్న సాయింత్రం ప్రియాంక రెడ్డి మృతుదేహాన్ని పోస్టుమార్టం చేసి కుటుంబ సబ్యులకు అప్పగించగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. 

 

పదిహేను బృందాలుగా ఏర్పడి హత్య చేసిన నిందితులను ఛేదించారు. కేవలం 24 గంటల్లో ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బండి ఆగిపోయింది అని పంచారు వేయించడానికి తీసుకెళ్లారు అని సోదరితో చెప్పిన ప్రియాంక రెడ్డి అక్కడ లారీ డ్రైవర్లు ఉన్నారని, వాళ్ళు దెయ్యాలలా ఉన్నారని భయమేస్తుంది అని చెప్పింది. ఆలా చెప్పిన కొద్దీ సేపటికే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్. 

 

ఉదయం లేచేసరికి ఆమె శవం సజీవదహనం అయ్యింది.. అనంతరం అక్కడ ఏమి జరిగింది ? ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరికి రాగా ఈరోజు ఆ ప్రశ్నలు అన్నింటికీ సీసీటీవీ ద్వారా సమాధానాలు దొరికాయి. ప్రియాంక రెడ్డిపై నలుగురు లారీ డ్రైవర్, క్లీనర్లు కలిసి ఆమెపై హత్యాచారం చేసినట్టుగా నిర్దారించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రియాంక రెడ్డితో టైర్ పంక్చర్ డ్రామా ఆడినట్టు పోలీసులు గుర్తించారు. 

 

మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి నలుగురు కలిసి గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారని పోలీసులు తేల్చి చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆమెపై అత్యాచారం చేసిన అనంతరం ఆమెకు ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. హత్యానంతరం మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి కిరోసిన్ పోసి తగలబెట్టారు ఆ తర్వాత మృతదేహాన్ని అండర్ పాస్ వద్దకు తీసుకెళ్లి అక్కడ పడేశారు. 

 

మరో నిందితుడు స్కూటీని అక్కడికే తీసుకొచ్చి పార్క్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం నలుగురు నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. నిందితులను మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. 

 

ఏది ఏమైనప్పటికి ఈ కేసు ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసును గుర్తు తెస్తుంది. ఒక్క తెలంగాణలోనే రోజు రెండు మూడు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్న ప్రభుత్వాం ట్విట్టర్ లో ఘోరం, జంతువులు అని పెడుతున్నారు కానీ సరైన శిక్ష పడేలా చెయ్యటం లేదు. ఒక్క ఈ కేసు ఏ కాదు.. 7 నెలల క్రితం 9 నెలల పసికందుపై జరిగిన అత్యాచారంపై మొదట ఉరిశిక్ష వేసిన తర్వాత జీవితాంతం నీకు ఫ్రీ ఫుడ్ జైల్లోనే పెడుతాం అని యావజ్జివ కారాగార జైలు శిక్ష విషించారు. ఇది మన పరిస్థితి. అమ్మాయిలను మాత్రం రాత్రివేళలో ఇంటి నుండి బయటకు పంపకండి. వారికీ అన్ని జాగ్రత్తలు చెప్పండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: