పోలీసులు సమాజాన్ని పరిరక్షిస్తూ సమాజం కోసం, ప్రజలకోసం పనిచేసే ఉద్యోగులు. అయితే వాళ్ళు సమాజం లో అసంబద్దత కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ సమాజానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని సమాజ సేవకు పాటుపడుతారు.అయితే గతం లో జరిగిన అఘాయిత్యాలు గోకుల్ చాట్, లుంబిని పార్క్ లలో బాంబులు వేసి అమాయకులను పొట్టన పెట్టుకున్న నరహంతుకులైన ఉగ్రవాదులు ముస్లిం మతానికి చెందిన వారని వారికీ పెద్ద గడ్డం ఉంటుందని ఎవరిని అడిగిన చెప్తారు.

 

అయితే మన దేశం లో ఎక్కువ ముస్లిం పరిసర ప్రాంతాలలో సాధారణంగా అందరికి పెద్ద పెద్ద గడ్డలు ఉంటాయి. అయితే వారిలో ఎవరు సాధారణ ప్రజలు, ఎవరు ఉగ్రవాదులు అని తెలుసుకోవడం చాల కష్టం. ఇటీవల రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అనిల్ పారిస్ దేశ్‌ముఖ్ ముందుగా ప్రజలలో సెక్యూరిటీ దృశ్య ప్రజల వేషధారణ మరియు నడవడికల పైన అవగాహనా కల్పించాలంటే ముందుగా మన డిపార్ట్మెంట్ లో మార్పు అవసరం అని వారు వారి తోటి ఉద్యోగులకు ముఖ్యముగా ముస్లిం ఉద్యోగుల గడ్డలను తీసేసి పోలీస్ స్టేషన్ మరియు విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేశారు. 

 

ఈ నిబంధన అంతటా అమలు కావాలని ఆదేశాలు జారీచేశారు మరియు పోలీసుల పనే కాదు, వాళ్ల యూనిఫామ్ కూడా సరిగ్గా ఉండాలని వ్యాఖ్యానించాడు.  ముందుగా మనం మారితేనే ప్రజలకు అర్థమయ్యేలా వివరించి వారిని కూడా సహకరించమని అడగవచ్చని లేదంటే మన మాట వినరని సూచించారు.

 

అయితే  గడ్డం ఎక్కువగా ఉన్న తొమ్మిది మంది  పోలీసులు గడ్డలు కత్తిరించుకొని విధులకు హాజరు అయ్యారు.  దీనికి కొందరు ముస్లిం ఉద్యోగులు ఒప్పుకోకపోవడం తో వారు ఉన్నతాధికారులకు మోర పెట్టుకున్నారు అయితే ఈ నిబంధన చట్టాలకు అనుకూలంగా  లేదు అని దీనికి సంబందించిన నిబంధన ప్రస్తుతానికి వాయిదా వేసి  ఈ నిర్ణయం పట్ల  ముస్లిం పోలీసులు అసంతృప్తి వ్యక్తమైతే  దీనిపైనా పునరాలోచిస్తామని దేశ్ ముఖ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: