బాలకృష్ణ ఇప్పటికే 105 సినిమాలు చేశారు.  తన కొత్త సినిమా రూలర్ వచ్చేనెల 20 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ అంచనాల నేపథ్యంలో సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా తరువాత బాలయ్య తన 106 వ సినిమా బోయపాటితో చేయబోతున్నారు.  వందకు పైగా సినిమాలు చేసిన బాలయ్య తన నటవారసుడు మోక్షజ్ఞను మాత్రం ఇప్పటి వరకు వెండితెరకు పరిచయం చేయడం లేదు.  
బాలకృష్ణ వందో సినిమా ద్వారా పరిచయం చేస్తారని అభిమానులు అనుకున్నారు.  కానీ, అది జరగలేదు.  సమయం కాదని పక్కన పెట్టారు. బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా చేస్తారని అనుకున్నారు.  అది కూడా ఇప్పటి వరకు రూపుదాల్చలేదు.  మోక్షజ్ఞతో సినిమా చేయబోయే దర్శకులు వీరే అని చెప్పి ఇప్పటికే అనేక పేర్లు బయటకు వచ్చాయి.  కానీ, ఏ ఒక్కటి కూడా నిజం కాదని తేలిపోయింది.  
అసలు సినిమా ఉంటుందా లేదా అని కూడా తెలియడం లేదు.  బాలయ్య కొడుకు సినిమాలు చేయడం లేదని కొందరు అంటున్నారు.  కొన్ని రోజుల క్రితం బాలయ్య కొడుకు తీసుకొని తూర్పు గోదావరి జిల్లాలో పూజలు చేయించారు.  ఆ పూజల తరువాత వస్తారని అనుకున్నారు.  కానీ, అది కూడా జరిగేలా కనిపించడం లేదు.  మోక్షజ్ఞకు సినిమాల్లో నటించాలని లేదని, అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు.  
మోక్షజ్ఞకు బిజినెస్ రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నారని సమాచారం.  ఒకవేళ అదే నిజమైతే బాలయ్య వారసుడు సినిమాల్లో లేనట్టే. ఇదిలా ఉంటె, మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటో ఒకటి రీసెంట్ గా బయటకు వచ్చింది. బాలయ్య, చిన్నల్లుడు, బాలయ్య భార్య, మోక్షజ్ఞ కలిసి ఉన్న ఫోటో అది.  అందులో మోక్షజ్ఞను చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. హీరోకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా మోక్షజ్ఞతో కనిపించడం లేదు.  లావుగా ఉన్నాడు.  పైగా షాపులు కూడా విచిత్రంగా ఉన్నాయి.  చూస్తుంటే బాలయ్య కొడుకు సినిమా రంగానికి దూరంగా ఉండాలని అనుకున్నారేమో అనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: