మన అందరిని ఎంతగానో కలచివేస్తుంది డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య. హత్య జరిగిన 24 గంటల్లోపే పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌‌లలో కనిపించిన లారీ నంబర్ల ఆధారంగా నేరస్తుల కోసం గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు. అయితే వారిలో ప్రధాన నిందితులైన నలుగురు మృగాళ్లు ఎవరంటే.. నవీన్ (డ్రైవర్), శివ (క్లీనర్), చిన్నకేశవులు (క్లీనర్), మహ్మద్ పాషా. అయితే అసలు ప్రధాన నిందితుడైన మహమ్మద్ పాషా అనే నీచుడిది.. నారాయణ్ పేట్ జిల్లా, మక్తల్ మండలం జక్లేర్ గ్రామం. చెన్నకేశవులు గుడిగండ్లకు చెందిన వాడు.


25 ఏళ్ల లోపు ఉన్న ఈ నిందితులంతా హైదరాబాద్ నుంచి రాయచూర్ కు లారీలలో ఇనుప రాడ్లను తరలిస్తారని తెలిసింది. ఈ నలుగురు తొండుపల్లి టోల్‌ప్లాజా వెనుక ఉన్న నిర్మానుష్య ఖాళీ ప్రదేశంలోకి ప్రియాంక రెడ్డి ని తీసుకెళ్లి సామూహిక మానభంగం చేసి.. ఆ తర్వాత కెరొసిన్ పోసి చంపారని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రియాంక మృతదేహం గంట సేపటికి పైగా కాలిపోవడంతో శవపరీక్ష చేయడం చాలా క్లిష్టంగా మారిందని అధికారులు చెప్పారు. ప్రియాంక గొంతుపై ఉన్న కొన్ని గాయాలను బట్టి ఆమె మెడను చున్నీతో బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


ప్రధాన నిందితుడైన మహమ్మద్ 2 రోజుల క్రితం పనికి పోతున్నానని చెప్పి వెళ్లాడని తన తల్లి చెపుతుంది. అయితే నిన్న అర్ధరాత్రి ఒకటింటికి కంగారు పడుతూ, గాభరా పడుతూ.. తన ఇంటికి వచ్చి పడుకున్నాడు అని పాషా వాళ్ళ అమ్మ తెలిపింది. అయితే పోలీసులు 3 గంటల సమయంలో వచ్చి మహమ్మద్ పాషాను అదుపులోకి తీసుకున్నారు.


మహమ్మద్ పాషా వాళ్ళ అమ్మ మాట్లాడుతూ.. ' నా కొడుకు ప్రియాంక రెడ్డి పై అత్యాచారం చేసినట్లు నిరూపితం అయితే వెంటనే వాడిని ఉరి తీసి చంపేయండి సారూ అంటూ రోదించింది. బాగా మద్యం సేవించి ఒంటరిగా ఉన్న ప్రియాంక రెడ్డి పై కన్నేసి కిరాతంగా చంపేసిన ఈ నలుగురికి సరైన శిక్ష విధించాలని, ప్రియాంక కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మనమందరం కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: