ఇంత నీచమా.. ఇంత దారుణమా.. ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా మనము.. ఛీ!! రాస్తున్నాను కానీ నా కంట కన్నీరు ఆగటం లేదు.. ఎందుకంటే నేను అమ్మయినే.. రెండు రోజులలో ఆరుమంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఏంటి ఈ సమాజం.. ఇక్కడ ఉన్న మానుషాలకంటే క్రూరమృగాలే నయం. 

 

డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య మరువక ముందే.. నిన్న వరంగల్ లో మానస.. నేడు ఉదయం తమిళనాడులో రోజా.. ఇప్పుడు శంషాబాద్ లో మరో యువతీ. రాస్తున్నాను కానీ నా వేళ్ళు కదలడం లేదు.. బయటకు వెళ్లాలంటే వణుకు పుడుతుంది. ఒక జర్నలిస్ట్ అయినా నేనే ఇంత భయపడే స్థితి వచ్చింది అంటే ఏంటి ఈ దారుణం.. 

 

పోలీసులు ఏం చేస్తున్నారు అని అందమంటే వాళ్ళు అయినా ఎం చేస్తారు ? అరెస్ట్ చేస్తారు కోర్టుకు తీసుకెళ్తారు.. కానీ అక్కడ లాయర్ల దెబ్బకు సైలెంట్ గా వారిని వదిలేయాలి.. రెండు రోజుల్లో ఇన్ని ఘటనలు.. ప్రభుత్వాలు ఎం చేస్తున్నాయి ? నిద్ర పోతున్నాయ ? అని ప్రశ్నించాలి అని ఉంది.. కానీ మనం ప్రశ్నించిన వాటికీ జవాబులు రావు.. 

 

అసలు ఎందుకు జరుగుతాయి అండి ఈ దారుణాలు ? ఎందుకు జరుగుతాయి ? అత్యాచారం చేసిన ఒక్కడికైనా శిక్ష పడిందా ? దున్నపోతులాల జైల్లో కూర్చొని మేస్తున్నారు గలీజు నయల్లంత.. ఇంతమంది ఆడవారు సజీవ దహనం అయినా వారికీ ఏమాత్రం కనికరం లేదు.. అసలు ఇలాంటి వారికీ ఉరి శిక్ష కాదు.. ఏది చూసుకొని అమ్మాయిలపై పందులలా పడుతున్నారో దాన్ని కోసి పారేయాలి.. లేదంటే నడిరోడ్డుపై అందరూ చూస్తున్న సమయంలో పక్క దేశాలలో జరిగేలా కుక్కలకు తినిపించాలి. 

 

అప్పుడైనా ఈ మృగాళ్లలో మార్పు వస్తుంది ఏమో చూడాలి.. ఈరోజు.. కొద్దీ క్షేణాల క్రితమే ఒక మహిళా శరీరం కాలుతూ ఒక వ్యక్తికి కనిపించింది. ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ హైదరాబాద్ కాస్త ఇప్పుడు మరో ఢిల్లీ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: