నిన్న హైదరాబాద్ లోని షాద్ నగర్ టోల్ గేట్ పరిధిలో దారుణంగా అత్యాచారం గావించబడి ఘోరంగా హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి పై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు మరియు పలు సంఘాల వారు ఎంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నలుగురు యువకులు ఆమెను ఒక ప్లాన్ ప్రకారం అటకాయించి ఆపై ఆమెను మాటలతో మోసం చేసి అత్యాచారం చేయడం, అనంతరం ఆమెను ఊపిరాడకుండా చేసి హత్యచేసి, దాని తరువాత పెట్రోల్ పోసి దహనం చేసిన ఈ ఘటన అందరిని ఎంతో కలిచి వేసింది. ఇక ఈ దుర్ఘటనలో షాకింగ్ విషయం ఏమిటంటే, ప్రియాంకను అంత ఘోరంగా హతమార్చిన ఆ నాలుగు దుండగుల్లో ముగ్గురు 20 నుండి 23 ఏళ్ళ వయసువారే కావడం. అయితే దీనిపై కొందరు మానసిక నిపుణులు చెప్తున్న విషయాలను బట్టి చూస్తే, 

 

వాస్తవంగా ఇటువంటి దురాగతాలు జరగడానికి కొందరు తల్లితండ్రులు వారి బిడ్డలను సక్రమంగా పెంచకపోవడంతో పాటు, సెల్ ఫోన్ లో అస్లీల చిత్రాలు చూడడం మరియు దానితో పాటు వయో బేధం తేడా లేకుండా చిన్న వయసులోనే మద్యానికి అలవాటు పడడం వంటి కారణలు అని అంటున్నారు. నిజానికి యవ్వనంలో ఉన్న బిడ్డల నడవడిక మరియు ప్రవర్తనను, ముఖ్యంగా మగ బిడ్డలను పెంచే తల్లితండ్రులు, వారు ఏవైనా చెడు అలవాట్లకు లోనవుతున్నారా, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎటువంటి పనులు చేస్తున్నారు అనేటువంటి వాటిపై ఒకింత నిఘా ఉంచడం మంచిదని అంటున్నారు. అయితే చాలా మంది తల్లితండ్రులు ఇటువంటి పనులు ఏవో పెద్ద తప్పులుగా భావిస్తుంటారని, 

 

అయితే ఈ విధంగా తాము చెప్తున్నట్లుగా అబ్బాయిల విషయమై ఒక కంట కనిపెడితే మంచిదని, ఎందుకంటే మన నిఘా సమయంలో వారు ఏవైనా తప్పుడు అలవాట్లు చేసుకున్నట్లు తేలితే, వెంటనే వాటిని గ్రహించి, వాటివలన జరిగే చెడు మరియు నష్టాలను నెమ్మదిగా చెప్పడం వలన మెల్లగా అతడిని వాటినుండి దూరం చేయవచ్చని, తద్వారా చాలా వరకు అతడి జీవితానికి మేలు జరుగుతుందని, దాని వలన వారు భవిష్యత్తులో ఎటుంవటి తప్పుడు అలవాట్లకు బానిసలు అవ్వకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ఇటువంటి నియమాలు మనలోని చాలామంది తల్లితండ్రులు కనుక పాటించగలిగితే భవిష్యత్తులో మన దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు వంటివి కొంతవరకైనా తగ్గే అవకాశం లేకపోలేదని వారు చెప్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: