పోలీసులు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులైన సిద్దరామయ్య, హెచ్ డి కుమారస్వామి, అప్పటి బెంగళూరు పోలీస్ కమీషనర్  టి సునీల్ కుమార్, అతని కింద పనిచేసే అధికారులు , కొందరు కాంగ్రెస్, జెడి (ఎస్) నాయకులపై దేశ ద్రోహ కేసు ను  నమోదు చేశారు. లోకసభ ఎన్నికల సమయంలో ఐ టీ దాడులను నిరసిస్తూ ఐ టీ ఆఫీసు వద్ద నిరసన చేసినందుకు గాను వీరి పై పోలీసులు దేశ ద్రోహ కేసును నమోదు చేసారు.

 

సామజిక కార్యకర్త  ఎ మల్లికార్జున ఫిర్యాదు ఆధారంగా, ఐపిసిలోని వివిధ విభాగాల కింద క్రిమినల్ కుట్ర మరియు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధానికి ప్రయత్నించడం లేదా ప్రోత్సహించడం వంటి కేసులను నమోదు చేయాలని నగర కోర్టు ఇటీవల  పోలీసులను ఆదేశించింది.

 

ఈ కేసు కాంగ్రెస్, జెడి (ఎస్) నాయకుల నివాసంలో ఆదాయపు పన్ను దాడులకు వ్యతిరేకంగా అప్పటి ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామితో సహా ఇతర  నాయకులు  ఐ-టి కార్యాలయం సమీపంలో చేసిన  నిరసనలకు సంబంధించినది. కుమారస్వామి ముందుగానే ఈ చర్యలు జరగవచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు.

 

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కెఐఎ) కు పెద్ద సంఖ్యలో కేంద్ర భద్రతా దళాలు చేరుకున్నందున తమ  పై  దాడులు జరిగే అవకాశం ఉందని కుమారస్వామి మార్చి 27 న మీడియాతో చెప్పారు. మరుసటి రోజు బలగాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో కుమారస్వామి అంచనాలు  నిజమయ్యాయి. తరువాత, ఆదాయపు పన్ను కార్యాలయంలో భారీ ప్రదర్శన జరిగింది.

 

కేసు నమోదు చేసిన ఇతర ప్రముఖులలో అప్పటి ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర, డి కె శివకుమార్, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ దినేష్ గుండు రావు, అప్పటి పోలీసు డిప్యూటీ కమిషనర్లు రాహుల్ కుమార్, డి దేవరాజు మరియు  ఎన్నికల అధికారులు ఉన్నారు.

 

దేశద్రోహ ఆరోపణలపై స్పందించిన డి కె శివకుమార్ ఈ కేసులన్నీ రాజకీయంగా ప్రేరేపించబడిందని, రాజకీయంగా పోరాడతానని చెప్పారు.  "మేము ఆదాయపు పన్ను కార్యాలయంలోకి ప్రవేశించలేదు. మేము 150 మీటర్ల దూరంలో నిలబడి నినాదాలు చేశాము" అని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: